Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant: టీమిండియా వికెట్‌కీపర్, డాషింగ్ బ్యాటర్ రిషభ్ పంత్ మైదానంలోనే కాకుండా ఆర్థిక పరంగానూ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా రూ.23.84 కోట్ల భారీ ఆదాయపు పన్ను చెల్లించి, తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోనే అత్యధిక టాక్స్ చెల్లించిన వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. ఒకప్పుడు గురుద్వారాలో పెట్టే భోజనం తింటూ ప్రాక్టీస్‌కు వెళ్లిన పంత్, కేవలం పదేళ్ల కాలంలో శ్రమతో రూ. 120 నుంచి 150 కోట్ల నెట్ వర్త్ స్థాయికి చేరుకోవడం విశేషం.
పంత్ ఆదాయంలో ప్రధాన వాటా ఐపీఎల్ ద్వారా వస్తోంది. ఐపీఎల్ 2025 వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని ఏకంగా రూ. 27 కోట్ల రికార్డు ధరకు దక్కించుకోగా, రెండు సీజన్ల పాటు ఇదే భారీ జీతంతో ఆడాడు. దీనికి తోడు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ‘గ్రేడ్-బి’ ప్లేయర్‌గా ఏడాదికి రూ. 3 కోట్ల స్థిర ఆదాయంతో పాటు ప్రతి టెస్ట్ మ్యాచ్‌కి రూ. 15 లక్షలు, వన్డేకి రూ. 6 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజు పొందుతున్నాడు. ఆటతో పాటు ప్రకటనల ద్వారానూ పంత్ భారీగా ఆర్జిస్తున్నాడు. అడిడాస్, డ్రీమ్ 11, బోట్, జేఎస్‌డబ్ల్యూ వంటి ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఏడాదికి రూ. 8 నుంచి 15 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. షూటింగ్స్ కోసం రోజుకు రూ. 2.5 కోట్లు, రెండు రోజుల ఈవెంట్లకు రూ. 4.5 నుంచి 4.75 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడు. సోషల్ మీడియాలో ఉన్న కోట్లాది మంది ఫాలోవర్ల ద్వారా స్పాన్సర్డ్ పోస్టులు చేస్తూ డిజిటల్ క్యాంపెయిన్ల ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నాడు. కోట్ల ఆదాయంతో పాటు పంత్‌కు విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. ఢిల్లీ, డెహ్రాడూన్, రూర్కీలలో అతనికి అత్యంత విలువైన ఆలీషాన్ ఇళ్లు ఉన్నాయి. అతని గ్యారేజీలో రూ. 1.32 కోట్ల విలువైన ఆడి A8, రూ. 2 కోట్ల ఫోర్డ్ ముస్తాంగ్, రూ. 2 కోట్ల మెర్సిడెస్ బెంజ్ GLE వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటితో పాటు వరల్డ్ పికిల్‌బాల్ లీగ్‌లో ఓ జట్టుకు పంత్ యజమానిగా కూడా వ్యవహరిస్తున్నాడు.
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీ వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!