Kantara Update: బాక్సాఫీసును కొల్లగొడుతున్న కాంతార.. 300 కోట్లకి పైగా వసూళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kantara Update: చిన్న సినిమాగా మొదలై ఇండస్త్రీని ఓ ఊపు ఊపేస్తోన్న సినిమా కాంతార. కన్నడలో రూపొందినా కూడా కంటెంట్ కొత్తగా ఉంటే ఎలాంటి ప్రేక్షకులైనా ఆదరిస్తారనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది. కన్నడలో రూపొందిన ఈ కాంతార అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఆ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి వారం రోజుల్లో మరో మూడు భాషల్లో డబ్ చేసి విడుదల చేశారు. దీంతో విడుదలైన అన్ని భాషల్లోనూ వసూళ్ల వర్షం కురిపించింది. ఇంతవరకూ ఈ సినిమా 300 కోట్లకి పైగా వసూళ్లను సాధించినట్టుగా, తాజాగా ఈ సినిమా టీమ్ అధికారిక పోస్టర్ విడుదల చేసింది.
Read Also: Prabhas: మిల్కీబ్యూటీని ఆట ఆడిస్తున్న ప్రభాస్.. వైరలవుతున్న వీడియో
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
తెలుగులో డబ్ చేసిన ‘కాంతార’ పెను సంచలనాలను సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం కేవలం 18 రోజుల్లోనే భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 2కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 18 రోజుల్లో ఈ చిత్రానికి భారీ స్థాయిలో రూ. 22.68 కోట్లకుపైగా వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 20.38 కోట్లకుపైగా లాభాలు వచ్చినట్లు సమాచారం.
Read Also: Tirumala : తిరుమలలో కారు కలకలం.. పోలీసులు ఛేజింగ్.. కారు వదిలి లోయలో దూకిన యువకులు
రిషబ్ శెట్టి – సప్తమి గౌడ జంటగా నటించిన ‘కాంతార’ కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైంది. తొలి రోజునే అక్కడ ఆ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను చూడటంతో, 15 రోజుల తరువాత తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేశారు. ‘కేజీఎఫ్’ సినిమాను నిర్మించిన బ్యానర్ కావడంతో, ఇతర భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి బడా సంస్థలు పోటీ పడ్డాయి. ఏ భాషలో విడుదల చేస్తే ఆ భాషలో ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!