Site icon NTV Telugu

Rinku Singh: ఆకాశమే హద్దుగా చెలరేగిన రింకూ.. కేవలం 33 బంతుల్లోనే..!

Rinku

Rinku

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2023లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బాల్ కొడితే సిక్సర్ పోవాల్సిందే. టీమిండియా యువ బ్యాట్స్మెన్ రింకూ సింగ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పంజాబ్‌తో ఈరోజు జరిగిన క్వార్టర్‌ఫైనల్‌-1లో రింకూ చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 77 పరుగులు చేశాడు. రింకూ చెలరేగడంతో ఆఖరి రెండు ఓవర్లలో పంజాబ్ 39 పరుగులు సమర్పించుకుంది.

Read Also: IND vs SL: భారత్-శ్రీలంక వన్డే చరిత్రలో రికార్డ్స్ ఇవే..!

చివరి ఓవర్లో అర్షదీప్‌ సింగ్‌ బౌలింగ్ లో 3 సిక్సర్లు బాదాడు. దీంతో ఆ ఒక్క ఓవర్లోనే 23 పరుగులు వచ్చాయి. దీంతో ఉత్తర్‌ప్రదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మరో బ్యాటర్ సమీర్‌ రిజ్వి 29 బంతుల్లో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. యూపీ ఇన్నింగ్స్‌లో గోస్వామి (16), కరణ్‌ శర్మ (14), నితీశ్‌ రాణా (17) పరుగులకే ఔట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన సమీర్‌, రింకూ జట్టుకు మంచి స్కోరును అందించారు. పంజాబ్‌ బౌలర్లలో సిద్దార్థ్‌ కౌల్‌, హర్ప్రీత్‌ బ్రార్‌ తలో వికెట్‌ సాధించారు.

Read Also: Sajjala Ramakrishna Reddy: కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సజ్జల

అనంతరం 170 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌.. 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి గెలుపొందారు. పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా (52), అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (43), శన్వీర్ సింగ్ (35), రమన్ దీప్ సింగ్ (22), అభిషేక్ శర్మ (12) పరుగులు చేశారు. ఇక యూపీ బౌలర్లలో మోహిసిన్‌ ఖాన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్‌ కుమార్‌ 2 వికెట్లు తీశాడు.

Exit mobile version