టీ20 వరల్డ్‌కప్‌కు ముందు Rinku Singhకు షాక్.. సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rinku Singh: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాడు. అతని ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం (ఫిబ్రవరి 7) నుంచి భారత్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌లో తొలి రోజే టీమిండియా అమెరికా (USA)తో మ్యాచ్ ఆడనుంది.
T20 World Cup 2026: ప్రపంచ కప్ ముందు టీమిండియాలో అనూహ్య మార్పు.. జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్!
Also Read
టోర్నమెంట్‌కు జట్టు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన వెలుగులోకి రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్‌కు చెందిన రింకూ సింగ్ ఫేస్‌బుక్ అకౌంట్ ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని రింకూ స్వయంగా పోలీసులకు ఫోన్ ద్వారా తెలియజేశారని అలీగఢ్ ఎస్ఎస్పీ నీరజ్ జాదౌన్ తెలిపారు.
కొంతకాలంగా ఆ అకౌంట్‌ను ఉపయోగించడం లేదని, కానీ అందులో సందేహాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని రింకూ తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయమై రింకూ సోదరుడు సోను పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ అకౌంట్ ఎప్పుడు హ్యాక్ అయ్యింది? హ్యాకర్లు ఎవరు అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. రింకూ సింగ్ సంబంధించిన ఫేస్‌బుక్ అకౌంట్ కు దాదాపు 1.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!