NTV Telugu Site icon

Ricky Ponting: బీసీసీఐ ఆఫర్ను రిజెక్ట్ చేసిన రికీ పాంటింగ్.. కారణమేంటంటే..?

Ponting

Ponting

టీమిండియా కోచ్ పదవిని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తిరస్కరించాడు. అందుకు గల కారణాలను ఆయన వెల్లడించాడు. నేషనల్ టీమ్‌తో కలిసి సీనియర్ కోచ్‌‌గా పని చేయాలని ఆసక్తి ఉందని చెప్పాడు.. కానీ ఓ కారణంతో బీసీసీఐ ఆఫర్‌కు నో చెప్పినట్లు రికీ పాంటింగ్ తెలిపాడు. భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపలేమో అన్న ఆలోచనతో కోచ్ పదవిని తిరస్కరించానని చెప్పాడు. ద్రవిడ్‌ను కోచ్‌గా కొనసాగమని బీసీసీఐ కోరినప్పటికీ అతను కూడా అదే కారణంతో తప్పుకుంటున్న విషయం తెలిసిందే.

Kaamya Karthikeyan: ఎవరెస్ట్‌ని అధిరోహించిన 16 ఏళ్ల బాలిక.. అతి చిన్న వయస్కురాలిగా రికార్డ్..

టీమిండియా కోచ్‌గా తనను బీసీసీఐ సంప్రదించిందని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోందని రికీ పాంటింగ్ వెల్లడించాడు. ఆ విషయం తనకు తెలియకుండానే సోషల్ మీడియాలో పాపులర్ అయిపోతుందని చెప్పాడు. అయితే ఐపీఎల్ సాగుతున్న సమయంలో టీమిండియా కోచ్‌‌గా తనకు ఆసక్తి ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారని పాంటింగ్ తెలిపాడు. మరోవైపు.. కోచ్ పదవి చేపడితే ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలకు పని చేయకుండా ఉంటుందని.. ఇది కూడా మరో కారణమేనని చెప్పుకొచ్చాడు.

Mumbai: థానే కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురు మృతి

ప్రధాన కోచ్ ఏడాదికి 10 నుంచి 11 నెలల వరకు పనిచేయాల్సి ఉంటుందని.. ఇది తన లైఫ్ స్టైల్‌కు సరిపోదు అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. టీమిండియా కోచ్ పదవి తీవ్ర ఒత్తిడితో ఉంటుందని.. విదేశీ క్రికెటర్లు ఆసక్తి చూపకపోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా ప్రధాన కోచ్ కోసమని బీసీసీఐ రంగంలోకి దిగింది. అందుకోసం వీవీఎస్ లక్ష్యణ్, స్టీఫెన్ ప్లెమింగ్ కోసం బీసీసీఐ ఎంత ప్రయత్నించినప్పటికీ వారు ఒప్పుకోవడం లేదు. మరోవైపు.. ఫ్లెమింగ్ కోసం ఎంఎస్ ధోనీని బీసీసీఐ రంగంలోకి దించింది. ఫ్లెమింగ్‌తో కోచ్ పదవికి అప్లై చేయించడానికి బీసీసీఐ ధోనీ సహాయాన్ని కూడా కోరినట్లు కథనాలు వచ్చాయి. అయితే.. భారత జట్టు కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.