NTV Telugu Site icon

World Cup 2023: టీమిండియాకు అచ్చురాని అంఫైర్ మళ్లీ ఫైనల్లో..!

Umpire

Umpire

ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు మరొక రోజే సమయం ఉంది. ఈ మహాసంగ్రామం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఈ టోర్నీలో అన్నింటిలో అన్నీ మ్యాచ్లు గెలిచి మంచి ఫాంలో ఉన్న టీమిండియాను ఒక సమస్య భయపెడుతుంది. అదేంటంటే.. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టైటిల్ మ్యాచ్‌లో, టీమిండియాకు అచ్చురాని అంపైర్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతనే రిచర్డ్ కెటిల్‌బరో.. ఇప్పుడు ఈ అంఫైర్ టీమిండియాకు పెద్ద ముప్పులా మారే అవకాశం ఉంది. ఈ ప్రపంచ కప్‌లో రిచర్డ్ కెటిల్‌బరో తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఇంతకుముందు.. టీమిండియా ఆడిన మ్యాచ్‌లలో రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్‌గా ఉన్న మ్యాచ్లు ఓటమి పాలయ్యాయి. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్కు కెటిల్ బరో రావడం అశుభ సంకేతంగా సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Jay Shah: జైషాకు శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు.. ఆ విషయంలోనే..!

గత ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్‌గా ఉన్న టీమిండియా మ్యాచ్లు ఓడిపోయాయి. టీ20 వరల్డ్ కప్ 2014 ఫైనల్‌లో భారత జట్టు శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్ గా ఉన్నాడు. ప్రపంచ కప్ 2015 సెమీ-ఫైనల్స్‌లో కూడా టీమిండియా ఓడిపోయింది. ఆ తర్వాత.. టీ20 ప్రపంచ కప్ 2016 ఫైనల్‌లో టీమిండియా వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్లన్నింటికీ రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్ గా ఉన్నాడు.

Kerala Nurse: నర్సు నిమిష ప్రియ కథ.. దేశం కానీ దేశంలో మరణశిక్ష.. అప్పీల్‌ని తిరస్కరించిన కోర్టు..

ఇదిలా ఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో టీమిండియా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. అయితే ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఇండియా ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో కూడా అంపైర్గా రిచర్డ్ కెటిల్‌బరో ఉన్నాడు. ప్రపంచ కప్ 2019 సెమీ-ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా ఓటమిని మూటగట్టుకుంది. అప్పుడు కూడా రిచర్డ్ కెటిల్‌బరోనే ఉన్నాడు. అయితే ఇప్పటి ఫైనల్ మ్యాచ్కు రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్గా వ్యవహరిస్తుండటంతో.. భారత అభిమానుల్లో ఎక్కడో కొద్దిగా టెన్షన్ నెలకొంది.