Ram Gopal Varma: “ఆ కుక్కలను పట్టించుకోవద్దు”.. ‘రామాయణం’పై ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Gopal Varma: దర్శకుడు నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ ఎపిక్ మూవీ ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ (Ramayana: Rise of a Legend) సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాని కేవలం ఒక మామూలు భక్తి చిత్రంలా చూడకూడదని, ఇదొక ‘డివోషనల్ ఫోర్స్’ (Devotional Force) అని ఆర్జీవీ కొనియాడారు. ఈ గొప్ప ప్రాజెక్ట్ కోసం పని చేసిన టెక్నీషియన్లు, నటీనటులు అందరినీ ఆకాశానికెత్తేసిన ఆర్జీవీ, సినిమాపై వచ్చే నెగెటివ్ విమర్శలను అసలు పట్టించుకోవద్దని మేకర్స్‌కి సూచించారు. “ఈ మహత్తరమైన వండర్ (Wonder) ను క్రియేట్ చేయడానికి మీరు పడిన కష్టంతో పోలిస్తే.. సినిమాపై నెగెటివిటీని వ్యాప్తి చేసే విమర్శకులు ఏనుగు ముందు మొరిగే వీధి కుక్కలతో సమానం. వారి కామెంట్లను అస్సలు పట్టించుకోవద్దు” అని తన ఎక్స్ (X – Twitter) ఖాతా ద్వారా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అయితే.. మహర్షి వాల్మీకి రాసిన రామాయణం (Ramayan), గోస్వామి తులసీదాస్ రచించిన రామచరితమానస్ (Ramcharitmanas) ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సాధారణంగా మనం చూసే కథల కంటే ఈ వర్షన్ చాలా డిఫరెంట్‌గా, అండ్ విసెరల్ (Visceral) డైరెక్షన్‌తో, నటీనటుల పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో ఉందని వర్మ ప్రశంసించారు. “రామాయణం అంటే కేవలం భక్తి సినిమా కాదు, అదొక పవర్. ఇందులో హీరో ఆకాశంలో తేలియాడే నీలిరంగు దేవుడు కాదు.. ప్రపంచం అంతం ఎలా ఉంటుందో ముందే చూసి కూడా ధైర్యంగా ముందుకు నడిచే ఒక ధీరుడు” అని అభివర్ణించారు. సినిమాలోని క్యారెక్టర్ ఆర్క్స్ (Character arcs) గురించి మాట్లాడుతున్నప్పుడు, “ఇక్కడ శత్రువులను నాశనం చేసేది కేవలం రాజ్యం కాదు, బలహీనతను సవాలు చేసే మానసిక స్థైర్యం. పాత పద్ధతులన్నింటినీ పక్కనపెట్టి, కేవలం పవర్ లాజిక్‌తో సాగే ప్రతీ ఫ్రేమ్ వర్త్ అనిపిస్తుంది. ఈ సినిమాలో చూపించిన హింస కేవలం ఒక విజువల్ స్పెక్టకిల్ (Spectacle) కాదు.. అది పర్యవసానాల స్పష్టత” అని ఆర్జీవీ తెలిపారు.
Also Read
- Raaka Update: ముంబై టు హైదరాబాద్.. ‘రాకా’ షిఫ్ట్.!
- CM Chandrababu: స్థానిక ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం.. 2024 కంటే మెరుగైన ఫలితాలు!
- Kulfi Recipe: దీపావళికి మిగిలిపోయిన స్వీట్లతో టేస్టీ హోమ్మేడ్ కుల్ఫీ.. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సూపర్ రెసిపీ
- Anirudh-Kavya Wedding: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి వేళాయే.. వివాహం తేదీ, స్థలం, పూర్తి వివరాలు ఇవే..
ముఖ్యంగా సీతాదేవి అపహరణ తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్ గురించి వర్మ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “సీతను తీసుకెళ్ళిన తర్వాత రాముడు ఖాళీగా ఉన్న ఆశ్రమంలో నిలబడి చూసే సుదీర్ఘమైన కెమెరా షాట్.. ఆ బాధ అంతా ఒక లెక్కగా (Arithmetic) ఎలా మారిందో చాలా అద్భుతంగా చూపిస్తుంది” అని పేర్కొన్నారు. ఇక రావణాసురుడిగా నటించిన యష్ (Yash) నటనపై వర్మ ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. యష్ కేవలం విలన్ లాగా కాకుండా, తాను నాశనం చేయాలనుకున్నదాన్ని ఇప్పటికే మానసికంగా అంగీకరించిన ఒక శక్తివంతమైన పాత్రగా కనిపించారని అన్నారు. క్లైమాక్స్ ముందు ఏ సైన్యం లేకుండా రెండు వైపులా జరిగే ఫేస్ ఆఫ్ (Face-off) సీన్ గురించి చెప్తూ.. “యష్ ఎక్కడా గొంతు పెంచడు, కేవలం తన షరతును మాత్రమే చెప్తాడు. అతని ముఖంలో ఎలాంటి భయం, తడబాటు ఉండవు” అని ఆర్జీవీ వివరించారు.
అలాగే జటాయువు పాత్రలో నటించిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ.. “ఆ పోరాటం కేవలం విశ్వాసానికి సంకేతం మాత్రమే కాదు. రెక్కలు విరిగి, రక్తమోడుతున్నా కూడా ఆ పాత్ర ముందుకు సాగుతుంది. తన శరీరం చెప్తున్న దాన్ని మనస్సు ఇంకా అంగీకరించకపోవడమే దానికి కారణం. కిందపడిపోయినప్పుడు కూడా అరిచే కేకలు ఉండవు, కెమెరా అంతా అతడి ముఖంపైనే ఉంటుంది. తన కళ్ల వెనుక నడుస్తున్న చివరి వాదన మాత్రమే కనిపిస్తుంది. ఇది కేవలం త్యాగం (Sacrifice) మాత్రమే కాదు.. శ్వాస ఆగిపోయే వరకు పోరాడటమే ఏకైక మార్గమని అర్థం చేసుకున్న ఒక వీరుడి ప్రయాణం” అని వర్మ కొనియాడారు.
ఇక, నవంబర్ 5, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ (Ramayana: Rise of a Legend) చిత్రంలో లార్డ్ రాముడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor), సీతాదేవిగా సాయి పల్లవి (Sai Pallavi), లక్ష్మణుడిగా రవి దూబే (Ravie Dubey), రావణాసురుడిగా యష్ (Yash), శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), కైకేయిగా లారా దత్తా (Lara Dutta), దశరథుడిగా అరుణ్ గోవిల్ (Arun Govil) కీలక పాత్రల్లో నటించారు. అంతేకాకుండా, సినిమా చివర్లో వచ్చే పోస్ట్-క్రెడిట్స్ సీన్ (Post-credits scene), హనుమాన్ చాలీసా మ్యూజిక్ వీడియో ద్వారా లార్డ్ హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ (Sunny Deol) ను మేకర్స్ అధికారికంగా పరిచయం చేశారు.
తాజావార్తలు
-
Ram Gopal Varma: “ఆ కుక్కలను పట్టించుకోవద్దు”.. ‘రామాయణం’పై ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ రివ్యూ
-
Raaka Update: ముంబై టు హైదరాబాద్.. ‘రాకా’ షిఫ్ట్.!
-
Pakistan TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానాలు!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం.. 2024 కంటే మెరుగైన ఫలితాలు!
-
Kulfi Recipe: దీపావళికి మిగిలిపోయిన స్వీట్లతో టేస్టీ హోమ్మేడ్ కుల్ఫీ.. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సూపర్ రెసిపీ
ట్రెండింగ్
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!