టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ మూవీ హనుమాన్.. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా శుక్రవారం (జనవరి 12) న పాన్ వరల్డ్ రేంజ్‍లో విడుదలైంది.హనుమంతుడి ఆధారంగా వచ్చిన ఈ సూపర్ హీరో మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వస్తోంది.ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుంది.సినీ ప్రముఖులందరూ అతడిని ప్రశంసిస్తున్నారు. ఈ జాబితాలోకి ప్రముఖ దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ కూడా చేరారు. తన మార్క్ కామెంట్లతో ప్రశాంత్‍ను ఆయన ప్రశంసించారు.ఆలోచనా శక్తి ఉంటే తక్కువ బడ్డెట్‍తో కూడా వీఎఫ్‍ఎక్స్ ఎక్కువగా ఉండే చిత్రాలు తెరకెక్కించవచ్చని హనుమాన్‍తో ప్రశాంత్ వర్మ నిరూపించారని రామ్‍గోపాల్ వర్మ తెలిపారు.. ఇలాంటి చిత్రాలు తీయాలంటే వందల కోట్ల బడ్జెట్ అవసరమని భావించే వారికి చెంపదెబ్బలా హనుమాన్‍ను మూవీని తెరకెక్కించారని ఆయన అన్నారు. హనుమాన్ చిత్రంతో ఇండస్ట్రీకి సరికొత్త పాఠం నేర్పావంటూ ప్రశాంత్ వర్మకు ఆర్జీవీ కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు.
భారీ సినిమాలు పోటీలో ఉన్నా కూడా హనుమాన్ సినిమాకు బ్లాక్‍బాస్టర్ టాక్ వస్తుండడంపై కూడా ఆర్జీవీ అభినందించారు. గొలియత్‍ను డేవిడ్ అంతమొందించిన లాంటిదే ఇది అని చెప్పారు. నిరంతర శ్రమ మరియు తెలివి ఉంటే అతి తక్కువ బడ్జెట్‍తోనే హనుమాన్ లాంటి చిత్రాలు తెరకెక్కించవచ్చని ప్రశాంత్ వర్మ చేసి చూపించారని ఆయన చెప్పారు.ఈ సినిమా కమర్షియల్‍గా బ్లాక్‍బాస్టర్ హిట్ అవడం కన్నా ఇంకా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.తక్కువ బడ్జెట్‍లోనే ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కించారని మరిచిపోకూడదు. వీఎఫ్‍ఎక్స్ ఎక్కువగా ఉండే సినిమాలు తీయాలంటే రూ.300 కోట్లు, రూ.500 కోట్లు కావాలని కొందరు చెబుతుంటారు. అయితే, తక్కువ బడ్జెట్‍తో వీఎఫ్‍ఎక్స్ మూవీ తీయాలంటే తెలివి చాలని ప్రశాంత్ వర్మ నిరూపించారు. సమగ్రత, నిజాయితీ, నిరంతర శ్రమ మరియు పట్టుదల ఉంటే ఇది సాధ్యం చేయొచ్చని చెప్పారు” అని రామ్‍గోపాల్ వర్మ తెలిపారు.
Hey @PrasanthVarma , u are the DAVID and everyone knows who the GOLIATH is 💪 #hanumania pic.twitter.com/ChnZZQ1RjJ
— Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2024