మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం.. ప్రశ్నించే గొంతుకకు ప్రాణం పోసిన గడ్డ మల్కాజ్ గిరి అని లేఖలో పేర్కొన్నారు. కొడంగల్ లో రాజ్యం ఆదేశాలతో పోలీసు లాఠీలు నా ఇంటిపై పడి, నన్ను నిర్భంధించి, నడి రాత్రి ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన సందర్భాన్ని చూసి మల్కాజ్ గిరి చలించిందన్నారు. ఆరు నెలలు తిరగక ముందే, కేవలం 14 రోజుల వ్యవధిలో నన్ను తమ గుండెల్లో పెట్టుకుంది. ప్రశ్నించే గొంతుకై తెలంగాణ మొత్తానికి రక్షణగా నిలబెట్టింది. ఈరోజు మీ రేవంతన్న సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డపై జెండా ఎగురేసిందంటే దానికి పునాదులు పడింది మల్కాజ్ గిరిలోనే.. అని లేఖలో పేర్కొన్నారు.
Allu Arjun : వావ్..వాట్ ఎ టాలెంట్ గురూ.. నీటిపై బన్నీ బొమ్మ.. ఫ్యాన్స్ ఫిదా..
నా రాజకీయ ప్రస్థానంలో కొడంగల్ కు ఎంతటి ప్రాధాన్యత ఉందో.. మల్కాజ్ గిరికి అంతే ప్రాధాన్యత ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. నన్ను దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజ్ గిరి ప్రజలదేనన్నారు. ఐదేండ్లు మీరు ఆశించిన ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేశాను.. విస్తృత బాధ్యతల నేపథ్యంలో వ్యక్తిగతంగా కొన్ని సార్లు అనుకున్నంత సమయం ఇవ్వలేకపోయి ఉండొచ్చు.. తల్లి తన బిడ్డను దేశ రక్షణ కోసం పంపినట్టు… నన్ను మీరు తెలంగాణ రక్షణ కోసం గెలిపించి పంపారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇన్నాళ్లు ఆ బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వర్తించానని భావిస్తున్నాను.. ఈ సందర్భంగా మల్కాజ్ గిరి ప్రజలకు పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు. ఐదేళ్లే కాదు ఇక మీతో నా అనుబంధం.. నా గుండెల్లో మీ స్థానం శాశ్వతం. మల్కాజ్ గిరికి ఎప్పటికీ రుణపడి ఉంటా. నాడు మీరు పోసిన ఊపిరి… నా చివరి శ్వాస వరకు తెలంగాణ ఉజ్వల భవిత కోసం తపిస్తూనే ఉంటుందని లేఖలో తెలిపారు.
Thandel: చై కోసం రంగంలోకి అక్కినేని, దగ్గుబాటి హీరోలు