Site icon NTV Telugu

Revanth Reddy : అన్నదాతకు అండగా నిలవండి.. కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ లేఖ

Revanth Reddy

Revanth Reddy

రాష్ట్రంలో అకాల వర్షంతో రైతాంగం అతలాకుతలం అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజయీయం చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని అన్నదాతకు అపార నష్టం వాటిల్లిన తెలంగాణ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read : Health: కోడళ్ల అనారోగ్యానికి అత్తలే కారణమట

పెట్టుబడి వరద పాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టమాట, మిర్చి, మొక్క జొన్న, పొద్దుతిరుగుడు, శనగా, కూరగాయలు, మామిడి, తదితర పంటలకు తీవ్ర నష్టం సంభవించిందన్నారు. పంట నష్టంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంపై రేవంత్ రెడ్డి సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సాగు ఖర్చులు పెరిగాయని ప్రభుత్వం నుంచి ఎటువంటి చేయుత లేని పరిస్థితుల్లో ఆకాల వర్షం సృష్టించిన బీభత్సం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా రైతుల పరిస్థితి మారిందన్నారు.

Also Read : Akhilesh Yadav: కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది.. అఖిలేష్ వార్నింగ్..

గతంలో కేంద్ర, రాష్ట్ర బృందాలు పర్యటించి పంట నష్టం చూసేవని కానీ ప్రస్తుతం రాష్ట్రంలో పంటల బీమా పథకం కూడా లేకుండా చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తక్షణమే పంట నష్టం అంచనా వేసి ఎరానికి రూ. 15 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాబోయే సీజన్ నుంచి ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేసి తక్షణమే రూ. లక్ష రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Exit mobile version