రీజినల్ రింగు రోడ్డుకు (నార్త్ పార్ట్) సంబంధించి 90 శాతం భూ సేకరణ పూర్తయినందున పనుల ప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక, క్యాబినెట్ అనుమతి కోరారు. జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌కు అనగుణంగా రీజినల్ రింగు రోడ్డు (సౌత్ పార్ట్)కు అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం కోరారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతి కోరారు.
రావిర్యాల-ఆమన్‌గల్-మన్ననూర్ రహదారిని నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారిగా నిర్మించాలని కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మన్ననూర్-శ్రీశైలం (ఎన్‌హెచ్ 765) నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతి.. హైదరాబాద్-మంచిర్యాల మధ్య నూతన గ్రీన్‌ఫీల్డ్ రహదారిని జాతీయ రహదారిగా మంజూరు.. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారికి అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. సీఆర్ఐఎఫ్ కింద రూ.868 కోట్లతో పంపిన రహదారుల పనులను మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
Also Read: Asia Cup 2025: పసికూన హాంగ్ కాంగ్‌ను ఉతికారేసిన అఫ్గానిస్తాన్.. ఒమర్జాయ్ వీరవిహారం!
సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్ఐఎఫ్ పనులకు వారంలోపు అనుమతులు ఇస్తామని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ-అమరావతి-బందరు పోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ రహదారికి సంబంధించి తమ శాఖ అధికారులను హైదరాబాద్‌కు పంపుతానని హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఎన్‌హెచ్, ఎన్‌హెచ్ఏఐ అధికారులతో ఈ నెల 22వ తేదీన హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహిస్తామని కేంద్రమంత్రి గడ్కరీకి సీఎం రేవంత్ తెలిపారు.
