NTV Telugu Site icon

Revanth Reddy : భూ కబ్జాలు, ఇసుక దోపిడీ దొంగను బీఆర్‌ఎస్ తన అభ్యర్థిగా నిలిపింది

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి విజయభేరి బస్సు యాత్ర మొదలైంది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో తాండూరుకు నీళ్లు ఇవ్వాలని ఆనాడు సాగునీటి ప్రాజెక్టులు తెచ్చుకున్నామన్నారు. మీరు భుజాలపై మోసి గెలిపిస్తే పైలట్ రోహిత్ రెడ్డి వందల కోట్లకు అమ్ముడు పోయాడని, భూ కబ్జాలు, ఇసుక దోపిడీ దొంగను బీఆరెస్ తన అభ్యర్థిగా నిలిపిందన్నారు రేవంత్‌ రెడ్డి. ఎప్పుడూ ఒకరిపై ఒకరు కాలుదువ్వుకునే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే… ఇవాళ ఒకరి కాళ్లు ఒకరు మొక్కుకుంటుర్రు అని, కాంగ్రెస్ గెలుస్తుందని కేసీఆర్ కు తెలిసిపోయిందన్నారు రేవంత్‌ రెడ్డి..

Also Read : Ambajipeta Marriage Band : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

అంతేకాకుండా.. ‘అందుకే ఓడిపోతే రెస్ట్ తీసుకుంటామని చెప్పిండు.. కేసీఆర్ తన ఓటమిని అచ్ఛంపేటలో ముందే ఒప్పుకున్నాడు. కేసీఆర్ ఓడితే నీది ఏం పొదనుకోకు…. నువ్ మింగిన లక్షకోట్లు కక్కిస్తాం.. 10వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంటాం. కేటీఆర్..నువ్వు భూములు ఆక్రమించుకుంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగినట్టా.. కాంగ్రెస్ అభివృద్ధికి పునాదులు వేస్తే.. మీరు వచ్చి దోచుకున్నారు తప్ప చేసిందేం లేదు.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి. డీకే శివకుమార్ గారు లక్ష 20వేల మెజారిటీతో గెలిచారు.. కొడంగల్, తాండూరు, పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి.’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read : Ambajipeta Marriage Band : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

Show comments