Revanth Reddy : భూ కబ్జాలు, ఇసుక దోపిడీ దొంగను బీఆర్‌ఎస్ తన అభ్యర్థిగా నిలిపింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి విజయభేరి బస్సు యాత్ర మొదలైంది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో తాండూరుకు నీళ్లు ఇవ్వాలని ఆనాడు సాగునీటి ప్రాజెక్టులు తెచ్చుకున్నామన్నారు. మీరు భుజాలపై మోసి గెలిపిస్తే పైలట్ రోహిత్ రెడ్డి వందల కోట్లకు అమ్ముడు పోయాడని, భూ కబ్జాలు, ఇసుక దోపిడీ దొంగను బీఆరెస్ తన అభ్యర్థిగా నిలిపిందన్నారు రేవంత్ రెడ్డి. ఎప్పుడూ ఒకరిపై ఒకరు కాలుదువ్వుకునే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే… ఇవాళ ఒకరి కాళ్లు ఒకరు మొక్కుకుంటుర్రు అని, కాంగ్రెస్ గెలుస్తుందని కేసీఆర్ కు తెలిసిపోయిందన్నారు రేవంత్ రెడ్డి..
Also Read : Ambajipeta Marriage Band : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
అంతేకాకుండా.. ‘అందుకే ఓడిపోతే రెస్ట్ తీసుకుంటామని చెప్పిండు.. కేసీఆర్ తన ఓటమిని అచ్ఛంపేటలో ముందే ఒప్పుకున్నాడు. కేసీఆర్ ఓడితే నీది ఏం పొదనుకోకు…. నువ్ మింగిన లక్షకోట్లు కక్కిస్తాం.. 10వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంటాం. కేటీఆర్..నువ్వు భూములు ఆక్రమించుకుంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగినట్టా.. కాంగ్రెస్ అభివృద్ధికి పునాదులు వేస్తే.. మీరు వచ్చి దోచుకున్నారు తప్ప చేసిందేం లేదు.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి. డీకే శివకుమార్ గారు లక్ష 20వేల మెజారిటీతో గెలిచారు.. కొడంగల్, తాండూరు, పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి.’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Ambajipeta Marriage Band : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?