Revanth Reddy : కేసీఆర్ చెప్పిన తెలంగాణ మోడల్ ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ కవాతు పేరిట తెలంగాణ కాంగ్రెస్ కరీంనగర్లో సభను నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ప్రాంతంలో ఒక గొప్ప పవిత్ర స్థలం ఉంటుందని, కరీంనగర్ లో అలాంటి గొప్ప పవిత్ర స్థలం అంబేద్కర్ స్టేడియమన్నారు. 60ఏళ్ల ఆకాంక్షను గౌరవించి 2004లో ఇదే గడ్డపై తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ మాట ఇచ్చారని, వేములవాడ, కొండగట్టు పుణ్య క్షేత్రాలకు ఎంత ప్రాధాన్యత ఉందో.. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంకు అంతే ప్రాధాన్యత ఉందన్నారు. అంతేకాకుండా.. ‘మాట తప్పక మడమ తిప్పక…. సోనియా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. ఇచ్చిన రాష్ట్రం ఇవాళ ఎవరిపాలైందో మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా?
Also Read : Punjab: ఖరీదైన మందులను నియంత్రించేందుకు తీర్మానం.. అసెంబ్లీ ఆమోదం
Also Read
కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చారా? తెలంగాణ ఉద్యమకారులకు, నిరుద్యోగులకు ఈ వేదికగా ప్రశ్నిస్తున్నా.. ఇక్కడ ఎంపీలుగా గెలిచిన కేసీఆర్, తన కుటుంబం కరీంనగర్ కు ఏం చేశారు? పొన్నం ప్రభాకర్ ను గెలిపిస్తే.. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు.
జైపాల్ రెడ్డి చొరవతో, వ్యూహంతో ఆనాడు తెలంగా రాష్ట్రం ఏర్పడింది. తల్లిని చంపి పిల్లను బ్రతికించారని మోదీ అవహేళన చేశారు. తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని బీజేపీ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదు. ఇక్కడ గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశారు? కేసీఆర్ పదే పదే తెలంగాణ మోడల్ అంటున్నారు.. తెలంగాణ మోడల్ అంటే తాగుబోతుల తెలంగాణనా?
Also Read : Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ
కేసీఆర్ వచ్చాక 3వేల వైన్ షాపులు.. 60వేల బెల్టు షాపులు వచ్చాయి. కేసీఆర్ చెప్పిన తెలంగాణ మోడల్ ఇదేనా? కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూస్తే… పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే.. గుజరాత్ మోడల్ కావాలో.. ఛత్తీస్ ఘడ్ మోడల్ కావాలో విజ్ఞులు ఆలోచించాలి. తెలంగాణ మోడల్ కావాలో.. ఛత్తీస్ ఘడ్ మోడల్ కావాలో ఆలోచన చేయండి. ఎవరి చేతిలో పెడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తాం.. ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం.. పేద రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటాం.’ అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!