NTV Telugu Site icon

Revanth Reddy : ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లు నీవురుగప్పిన నిప్పులా ఉంది

Revanth Reddy

Revanth Reddy

హాత్‌ సే హాత్‌ జోడో పేరిట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. 12వ రోజు.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన ఆయన… హన్మకొండ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తొమ్మిదేళ్లుగా అక్రమ కేసులు ఎదుర్కొని జైళ్లలో మగ్గిన వారు ఈ మీటింగ్ కు వచ్చారని ఆయన అన్నారు. ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లు నీవురుగప్పిన నిప్పులా ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో పెకిలించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు రేవంత్‌ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. మేధావులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు ఆలోచన చేయాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా? అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బొందలగడ్డగా మారింది. జయశంకర్ పేరు పెట్టిన ఏకశిలా పార్కు తాగుబోతులకు అడ్డాగా మారింది. కాకతీయ కళాక్షేత్రం కట్టలేదు. అంబేద్కర్ విగ్రహం పెట్టలేదు. తొమ్మిదేళ్లయినా అమరవీరుల స్థూపం ఎందుకు కావట్లేదు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. కాలనీలు, శిఖం భూములు అన్ని కబ్జాలు అయ్యాయి.

Also Read : Off The Record: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు? ముగ్గురులో రెన్యువల్‌ ఎవరికి?

ఎమ్మెల్యేలు దందుపాళ్యం ముఠా. కార్పొరేషర్ పరిధిలోని ఐదుగురు ఎమ్మెల్యేలు వందల కోట్లకు పడగలెత్తారు. ఎంపీ దయాకర్ హన్మకొండ సిటీలో ఐదు ఎకరాలు కబ్జా పెట్టిండు.. ప్రణయ్ భాస్కర్ కు మంచిపేరుండే.. ఆయన తమ్మునిగా వినయ్ భాస్కర్ ప్రజల ముందుకు వచ్చాడు.. అన్నకు సున్నం పెట్టిండు, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు.. తెలంగాణ గడ్డమీద కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందనే నమ్మకం కలుగుతుంది.. నాయకులతో సంబంధం లేకుండా సోనియాగాంధీ బొమ్మతో ఎవరు నిలబడ్డ గెలుస్తారు.. నేను కార్యకర్తలకు నాయకుణ్ణి, నాయకులకు కాదు. అందరి సమక్షంలో మాట ఇస్తున్న, కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారిని ఆదుకుంటాం.. దందుపాళ్యం ముఠాకు హచ్చరిస్తున్నా, కొత్త సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న వారిని వదిలిపెట్టం. పోలీసులకు కూడా హెచ్చరిస్తున్నాను, ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయకండి.
మీరు రిటైర్ అయినా వదిలిపెట్టం. ప్రజాలల్లో మార్పు వచ్చింది, మా నాయకులల్లో కూడా మార్పు వచ్చింది, మేమంతా ఐక్యంగా ఉన్నాం.’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read : MLA Sayanna : ఉద్రిక్తతల మధ్య ముగిసిన సాయన్న అంత్యక్రియలు