Revanth Reddy : స్వతంత్రంతో ఒకవైపు ఆనందం. మరోవైపు దేశ విభజన విషాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం నడిచిందన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమంలో లక్షలాది మంది జైళ్ల పాలు అయ్యారన్నారు. వేలాది మంది ప్రాణత్యాగాలు చేశారని, బ్రిటిష్ వారిని తరిమి కొట్టి ప్రజలకు స్వేచ్ఛ వాయువులు అందించి స్వతంత్రాన్ని తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. అంతేకాకుండా.. ‘మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేత్కర్, నెహ్రు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉద్యమాల ఫలితం నేటి స్వాతంత్రం. పోరాట ఫలితంగా వచ్చిన స్వాతంత్రం తో ఒకవైపు ఆనందం. మరోవైపు దేశ విభజన విషాదం. మత కల్లోలాలు, దేశ విభజన నేపథ్యంలో దేశంలో తొలి ప్రధానిగా నెహ్రు దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో తన దూర దృష్టి, విజ్ఞానం తో ఎంతో కృషి చేసారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో 140 కోట్ల ప్రజలు 75 ఏళ్ల నుంచి హక్కులు, బాధ్యతలతో దేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం, మత సామరస్యం, అభివృద్ధి, నైపుణ్యంతో దేశాన్ని శక్తి వంచన లేకుండా నెహ్రు దేశాన్ని ముందుకు నడిపారు. దేశం కోసం మహాత్మాగాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లు ప్రాణ త్యాగాలు చేశారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
దేశాన్ని కడు పేదరికం నుంచి నేడు ప్రపంచంలో ఒక శక్తి వంతమైన దేశంగా నిర్మించడంలో కాంగ్రెస్ ప్రధాన మంత్రులు చేసిన కృషి మరువలేనిది. దేశంలో ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించి ప్రజలను ఆత్మ గౌరవంతో బతికేల తీర్చిదిద్దిన ఘనత వారిది.. అలాగే 60 ఏళ్లుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటాన్ని గుర్తించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీది. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలతో కోట్లాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పాలకులది.దేశ ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్న గుర్తించి సమన్వయంతో పని చేసి ప్రజల మనసులలో మంచి స్థానం సంపాదించాం..కానీ నేడు దేశంలో మత తత్వ శక్తులు దేశంలో చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తుంది. ఎన్నో పోరాటాలు ఎంతో శ్రమకు ఓర్చి నిర్మించిన ఈ దేశంలో మళ్ళీ విభజించి లబ్ది పొందే చర్యలను మనం ప్రతిఘటించాలి.సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం లో పటిష్టమైన పోరాటంతో పనిచేయాలని కోరుకుంటున్నా’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!