Site icon NTV Telugu

Revanth Reddy : పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు

Revanth Redddy

Revanth Redddy

తెలంగాణలో ఎన్నికల ప్రచారం రోజు రోజుకు వేడెక్కుతోంది. పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారంలో ఆయా పార్టీలు స్పీడ్‌ పెంచాయి. ఈ నేపథ్యంలోనే నేడు మేడ్చల్‌లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ప్రజల్ని నమ్మించి మోసం చేసిన కేసీఆర్.. మళ్లీ మూడో సారి ముఖ్యమంత్రిని చేయాలని వస్తుండని, పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆరెస్ మేడ్చల్ కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇవ్వలేదన్నారు రేవంత్‌ రెడ్డి. జవహర్ నగర్ ప్రజలకు డంపింగ్ యార్డు బాధ పోలేదని, మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో జరిగిందే తప్ప బీఆరెస్ చేసిందేం లేదన్నారు రేవంత్‌ రెడ్డి.

Also Read : Nandamuri Balakrishna: ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన బాలకృష్ణ.. ప్రభుత్వంపై ఫైర్‌

అంతేకాకుండా.. ‘పదేళ్ల బీఆరెస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. పేదల ప్రభుత్వం రావాలంటే దొరల రాజ్యం కూలాలి.. ఇవి దొరల తెలంగాణకు… ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. దొరల తెలంగాణ కావాలో.. ప్రజా తెలంగాణ కావాలో తేల్చుకోండి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుంది. రూ.500లకే గ్యాస్ సిలిండర్.. మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తాం. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు సాయం అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ నెలా రూ.4వేలు అందిస్తాం.. ఆడబిడ్డ పెళ్లికి రూ.1లక్షతో పాటు తులం బంగారం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. మేడ్చల్ కు డిగ్రీ కాలేజీ, వందపడకల హాస్పిటల్ తెచ్చే బాధ్యత మాది.’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

BJP: రాష్ట్ర ఎన్నికలపై పాకిస్తాన్ కూడా కన్నేసింది.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

Exit mobile version