NTV Telugu Site icon

Revanth Reddy : కర్ణాటక ఎన్నికల ఫలితాలు మాకు వెయ్యి ఏనుగుల బలం

Revanth Reddy

Revanth Reddy

కన్నడ రాజకీయాలు మలుపు తీసుకున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ను తిరగరాస్తూ.. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రానుంది. అయితే.. కర్ణాటక కాంగ్రెస్‌ విజయాని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీకి మతం ఒక అవసరమని, మతంని రాజకీయాలకు వాడే విధానం ప్రజలు తిరస్కరించారన్నారు. కర్ణాటక ప్రజలు మోడీని ఓడించడంతో రాహుల్ జోడో యాత్రని విశ్వసించారన్నారు. జేడీఎస్‌కి మద్దతు పలికన కేసీఆర్ ని ఓడించారని, హాంగ్ రావాలని కేసీఆర్ చూశారన్నారు. మోడీని…కేసీఆర్ ఆలోచన కర్ణాటక ప్రజలు తిరస్కరించారని, తెలంగాణ ఎన్నికలపై ప్రభావము చూపుతాయన్నారు రేవంత్‌ రెడ్డి. జోడో యాత్ర రెండో విజయం కర్ణాటక అని, మూడో విజయం తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Bharat Jodo Yatra: కర్ణాటకలో భారత్ జోడో యాత్ర ఇంపాక్ట్.. రాహుల్ పర్యటించిన మెజారిటీ స్థానాల్లో విజయం

ఆఖరికి ఎర్రకోటపై జెండా ఎగరేస్తామని రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్.. ట్విట్టర్ లో స్పందించారని, ఎక్కడ ప్రజల తీర్పుని స్వాగతించలేదన్నారు. మోడీ ఓడిపోతే కేటీఆర్‌ ఎందుకు బాధ పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని, అక్కడి ఫలితాల ప్రభావం ఎక్కడ ఉంటాయని కేటీఆర్ ట్వీట్ చేశారని, కానీ.. క్యాన్సర్ ట్రీట్మెంట్ చివరి దశలో ఉన్న వారి ఆశ లాంటిదేనన్నారు రేవంత్‌ రెఎడ్డి. మోడీ ఓడిపోతే ఎందుకు బాధ పడుతున్నారని, ఆస్పష్ట రాజకీయాలు చేస్తున్నాయి బీజేపీ, బీఆర్‌ఎస్‌ లు అంటూ రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి చోటు లేదని, కర్ణాటక లాస్ట్ ఎన్నికల్లో కూడా గెలిచింది కాంగ్రెస్సే.. ఫిరాయింపుల తో… బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండు ఒక్కటేనని, వేరు వేరు కాదన్నారు.

Also Read : SRH vs LSG: ముగిసిన సన్‌రైజర్స్ బ్యాటింగ్.. లక్నో లక్ష్యం ఎంతంటే?

మోడీకి అండగా నిలబడ్డది కేసీఆరే అని రేవంత్‌ ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో మోడీ ని ఓడించండి అని స్టేట్మెంట్ ఇచ్చాడా..? ఇద్దరు దోస్తులు కాబట్టే అలా వ్యవహారం నడిపారు. మహారాష్ట్ర లో సభలు పెట్టె కేసీఆర్..కర్ణాటక లో ఎందుకు పెట్టలేదు. మోడీ ని ఓడించండి అని ఎందుకు పిలుపు ఇవ్వలేదు. కర్ణాటక లో మాదిరిగానే..ఇక్కడ కూడా 40 శాతం కమిషన్ తీసుకుంటుంది. మోడీ కి..కేసీఆర్ కి తేడా లేదు. పేర్లు మాత్రమే వేరు.. విధానాలు ఒక్కటే. పార్టీ ఫిరాయింపుల చేయడం.. ఎమ్మెల్యేల కొనడం.. కమిషన్ తీసుకోవడంలో ఇద్దరు ఒక్కటే. దళిత బంధు లో 30 శాతం కమిషన్ తీస్కుంటున్నట్టు కేసీఆర్ చెప్పారు. కొత్తగా మేము చెప్పేది ఏముంది. ఔటర్ అమ్ముకుంది ఆయనే’ అని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.