దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం సాయంత్రం ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఏకపక్ష విజయం సాధించి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. కాగా ఈ విజయంలో తెలుగమ్మాయి గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. ఈ కీలక మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చింది. అయితే.. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. మన మట్టిలో పుట్టిన మరో ఆణిముత్యం అని ఆయన ప్రశంసించారు. విశ్వ క్రీడా వేదికపై భారత కీర్తి పతాకాను ఎగరేసిన భద్రాద్రి ‘రామ బాణం’ అని, లక్షలాది యువ తరంగాలకు మరో స్ఫూర్తిగీతం అని, మహిళల అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ లో భారత జట్టును విశ్వ విజేతగా నిలిపిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు శుభాభినందనలు తెలిపారు రేవంత్ రెడ్డి..
Also Read : Nayanthara: లేడీ సూపర్ స్టార్ ను కమిట్మెంట్ అడిగే ధైర్యం చేసిందెవరు..?
ఇదిలా ఉంటే.. 69 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 3 ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది టీమిండియా. షఫాలి వర్మ(15), శ్వేతా సెహ్రావత్ (5) త్వరగా వెనుదిరగ్గా, సౌమ్య తివారి (24), తెలుగు అమ్మాయి త్రిష(24) చివరీ వరకు ఉండి ఇండియాను గెలిపిందించింది. అయితే త్రిష మాత్రం నిలకడగా ఆడింది. స్పల్ప స్కోరు కావడంతో ఆచితూచి ఆడింది. మొత్తం 29 బంతుల్లో 3 ఫోర్ల సహాయంతో 24 పరుగులు చేసి టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచింది. 14 ఓవర్లలోనే భారత్ గెలవడం గమనార్హం. ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Also Read : Today (30-01-23) Stock Market Roundup: బడ్జెట్ ముందు భయాలు
