Nayanthara: సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు రావాలంటే కచ్చితంగా హీరోయిన్లు కమిట్మెంట్ ఇచ్చి తీరాలి .. ఇది ఒక్కరి మాట కాదు. చాలామంది హీరోయిన్లు నిర్మొహమాటంగా మీడియా ముందు చెప్పిందే. అయితే కొందరు బయటపడతారు.. ఇంకొందరు బయటపడరు. ఇక ఇప్పటివరకు స్టార్ హీరోయిన్లు సైతం తమను నిర్మాతలు, హీరోలు కమిట్మెంట్ అడిగినట్లు చెప్పుకొచ్చారు. ఇక తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు చెప్పుకు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మొట్టమొదటిసారి క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పింది. మొదట్లో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదురుకున్నట్లు తెలిపింది.
“ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా.. లేదా అనేది నేను చెప్పలేను. కానీ నన్ను కూడా కమిట్మెంట్ అడిగారు. మన ప్రవర్తనను బట్టే మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. నన్ను అడిగారు.. నేను ముఖం మీదే నో అని చెప్పాను. నమ్ముకొని పైకి వచ్చాను. ఇప్పటికి అలాగే కొనసాగుతున్నాను” అని చెప్పుకొచ్చింది. ఇక నయన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ ను కమిట్మెంట్ అడిగే ధైర్యం చేసిందెవరు.. అని కొందరు అంటుండగా.. నయన్ నిజంగానే ట్యాలెంట్ ను నమ్ముకొని వచ్చిందని మరికొందరు చెప్పుకొస్తున్నారు.