NTV Telugu Site icon

CM Revanth: రాహుల్ గాంధీతో ముగిసిన రేవంత్ రెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే..?

Revanth

Revanth

రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.., కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలైన రాహుల్ గాంధీ, ప్రియంక గాంధీలను కలిశామని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్న అంశాలను వివరించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ చేసిన అంశాలపై అగ్రనేతలకు వివరించామని చెప్పారు. అంతేకాకుండా.. తెలంగాణకు రావాలని కోరామని భట్టి విక్రమార్క చెప్పారు. భవిష్యత్తులో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసి తెలంగాణ పీసీసీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశామని డిప్యూటీ సీఎం తెలిపారు.

UP: చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ట్రాక్‌పై నడక.. రైలు ఢీకొని ఇద్దరు మృతి

ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి బిజీబిజీగా గడపుతున్నారు. పలువురు కేంద్రమంత్రులను కలుస్తూ.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరుపుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల పై సోనియా గాంధీతో చర్చించారు. రైతులకు మొదటి విడతలో చేసిన రుణమాఫీ అంశాన్ని సోనియాగాంధీ కి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వివరించారు.

Read Also: Padma Shri Awardees: ప‌ద్మశ్రీ అవార్డు గ్రహీత‌ల‌కు రూ.25 వేల పింఛన్.. జీవో జారీ

ఇదిలా ఉంటే.. ఇంతకుముందు కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోంద‌ని, దానిని శుద్ధి చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం సంక‌ల్పించింద‌ని కేంద్ర మంత్రికి తెలిపారు. అంతేకాకుండా.. జాతీయ న‌ది ప‌రిర‌క్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధి ప‌నులకు రూ.4 వేల కోట్లు.. గోదావ‌రి న‌ది జ‌లాల‌ను ఉస్మాన్ సాగ‌ర్‌, హిమాయ‌త్ సాగ‌ర్‌ల‌తో నింపే ప‌నుల‌కు రూ.6 వేల కోట్లు కేటాయించాల‌ని కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ను ముఖ్యమంత్రి కోరారు.

Show comments