NTV Telugu Site icon

Revanth Reddy : నేను ఓ మెట్టు దిగి వస్తా ఆలోచించండి.. కలిసి పనిచేద్దాం..

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ నాయకులు అడుగులు వేస్తున్నారు. అయితే.. పార్టీలో నేతలు బలంగా ఉంటేనే తాము అధికారంలో వచ్చే దారి కనబడుతుందని అందరం కలిసి పనిచేద్దామంటూ వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి మా పార్టీలో లేరని, వివేక్..విశ్వేశ్వర రెడ్డి…జూపల్లి లాంటి నాయకులకు బీజేపీ సిద్ధాంతం కాదన్నారు. బీజేపీ వాళ్ళను నమ్మదు… వాళ్ళు బీజేపీ ని నమ్మరన్నారు.

Also Read : The Kerala Story: “ది కేరళ స్టోరీ”కి ఊరట.. పశ్చిమ బెంగాల్ నిషేధంపై స్టే విధించిన సుప్రీంకోర్టు..

కాంగ్రెస్ అమ్మలాంటిదని, కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలన్నారు. నన్ను ఎవరైనా తిట్టినా భరిస్తానని, కేసీఆర్ కి వ్యతిరేకంగా అందరం ఏకం కావడానికి అందరూ రండిని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ వల్ల కాదని, తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం పని చేయాలని అనుకున్న వారంతా కాంగ్రెస్ తో కలిసి రండని ఆయన అన్నారు. నా నాయకత్వంలో కాదు.. నేనే ఖర్గే నాయకత్వంలో పని చేస్తున్నానని, ఈటల.. కొం.. వివేక్.. పొంగులేటి.. జూపల్లిలు కాంగ్రెస్ లోకి రండని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ కోసం ఓ మెట్టు అయినా దిగుతానని, నా వల్ల ఇబ్బంది అనుకుంటే… సీనియర్ నేతలు అంతా ఉన్నారన్నారు. వాళ్ళతో అయినా మాట్లాడండని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఓ మెట్టు దిగి వస్తా.. ఆలోచించండని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ కి ఇవి చివరి అవతరణ ఉత్సవాలు అని, నెక్ట్ చేసేది మేమే అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Also Read : High Blood Pressure : అధిక రక్తపోటు ఉన్నవారు ఈ వ్యాయామం చేయకూడదు