Site icon NTV Telugu

Revanth Reddy : కేసీఆర్, మోడీ కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు

Revanth Reddy

Revanth Reddy

కేసీఆర్ మోడీ కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మీడియాను కేసీఆర్ కొనుగోలు చేశారన్నారు. అందుకే కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ద్వారా వాస్తవాలను వెలుగులోకి తీసుకువెళ్తుందని, కేసీఆర్ కి లిక్కర్ అంటే చాలా ఇష్టమని, అందుకే.. తెలంగాణలో లిక్కర్ ఆదాయాన్ని 36 వేల కోట్లకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌ది అని ఆయన విమర్శించారు. అందుకే ఇప్పుడు లిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, నోటీసులు లేకుండా అర్ధరాత్రి పోలీసులు కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేశారని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ ఉపేక్షించదని, తెలంగాణలో బీజేపీ ఐస్ ,నైస్ రాజకీయాలు చెల్లవని ఆయన వెల్లడించారు.
Also Read : Aadhi Pinishetty: ఈ సారి గట్టిగా ‘శబ్ధం’ చేస్తానంటున్న ఆది పినిశెట్టి

లిక్కర్ స్కామ్‌లో ఉన్నవారు, అవినీతి పరులతో కుమార స్వామి, అఖిలేష్ చేతులు కలపొద్దని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడికి, కేసీఆర్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్‌లోను కాంగ్రెస్ వార్ రూమ్ దాడి అంశాన్ని లెవనెత్తుతామని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నంత మాత్రాన కేసీఆర్ డీఎన్ఏ మారదని, పార్టీ పేరు మారినంత మాత్రాన కేసీఆర్ మారినట్లు కాదు.. కేసీఆర్ అవినీతి అందరికి తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వైఖరి యాంటీ టీఆర్ఎస్, యాంటీ కేసీఆర్ అని ఆయన వెల్లడించారు.

Exit mobile version