Site icon NTV Telugu

Revanth Reddy : ల్యాండ్ పూలింగ్ తో పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేశారు

Revanthreddy

Revanthreddy

వరంగల్ జిల్లా వర్ధన్నపేట విజయభేరి సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014కు ముందు చెప్పులు గతి లేని వ్యక్తులు ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారన్నారు. ల్యాండ్ పూలింగ్ తో పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేశారని, అడ్డుకోబోతే పోలీస్ బూట్లతో తన్నించారన్నారు రేవంత్‌ రెడ్డి. ల్యాండ్ పూలింగ్ జీవో రద్దు చేయలేదని, ఎన్నికలు వస్తున్నాయని తాత్కాలికంగా పక్కన పెట్టారన్నారు రేవంత్‌ రెడ్డి. ల్యాండ్ పూలింగ్ జీవో రైతుల మెడ మీద కత్తిలా ఉందని, కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా విద్యార్థులు త్యాగం చేస్తే ఇప్పుడు వాళ్ళను అణచివేస్తున్నారని రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

Also Read : Koti Deepotsavam Day 1 : సహస్ర కలశాభిషేకం, కోటిమల్లెల అర్చన, శ్రీశైలం శ్రీ మల్లికార్జున కల్యాణం

అంతేకాకుండా..’మూడో సారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాడు కేసీఆర్. కేసీఆర్ మనవనికి కూడా పదవి కావాలని చూస్తున్నాడు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దిగమింగాడు కేసీఆర్. తెలంగాణ రైతులను, మీడియాను తీసుకొని కాళేశ్వరం వెళ్దాం. ఇసుక కదిలితే బ్యారేజ్ వంగుతదా… బుద్దున్నొడు ఇసుక మీద బ్యారేజ్ కడతాడా.. చెప్పు తీసుకొని కొట్టండి కేసిఆర్ ను. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానన్న సన్నాసి, ఎంత మందికి ఇచ్చావు. వెయ్యి ఎకరాల ఫార్మ్ హౌస్ కట్టుకున్నవు. హైదరాబాద్ లో పది ఎకరాల గడీని కట్టుకున్నాడు. ఇంటికో ఉద్యోగం అని ప్రజల్ని మోసం చేసి తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు నెల ప్రారంభంలో జీతం ఇచ్చాము. 20 వ తేదీ వచ్చినా జీతాలు ఇయ్యలేని దుస్తితి తెచ్చాడు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఎర్రబెల్లి కరెంట్ తీసేస్తా. కల్వకుంట్ల కుటుంబం ట్రాన్స్ఫార్మర్ లు పేలిపోతాయి. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే దొర దగ్గర బానిసలుగా పడిఉంటారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మీకోసం ప్రశ్నిస్తారు. హామీ ఇచ్చి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6గ్యారెంటీలు ఇప్పుడు హామీ ఇస్తున్నాం, వచ్చే నెలలో ఇచ్చి తీరుతాం.’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Also Read : Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ యాప్ ట్రాప్లో ప్రముఖ కంపెనీ.. ఉచ్చు బిగుస్తోంది..!

Exit mobile version