Site icon NTV Telugu

Revanth Reddy : అవిభక్త కవలలు మోడీ.. కేసీఆర్

Revanth Reddy

Revanth Reddy

మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముప్పై సంవత్సరాలకు లక్ష కోట్లకు అమ్మకానికి పెట్టారని, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి… నేను చెప్పింది తప్పు అని అన్నారని, 135 పేజీల అగ్రిమెంట్ బయట పెడుతున్నానని రేవంత్‌ రెడ్డి తెలిపారు. టెండర్ పొందిన సంస్థ గడువు లోపు డబ్బులు చెల్లించాలని, కానీ అలాంటి నిబంధన లేదంటున్నారు అధికారులు.. ఎమ్మెల్యేలు అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘అగ్రిమెంట్ లో మాత్రం ఇది పొందుపరిచారు. పేజీ 20 లో ఈ నిబంధన ఉన్నది. మొదటి ముప్పై రోజుల్లోనే 25 శాతం చెల్లించాలి అని ఉంది. నేను చెప్పింది 10 శాతమే. కానీ నిబంధనల్లో 25 శాతం ఉంది.

Also Read : Peedika Rajanna Dora: టీడీపీ నాయకులకు రాజన్న సవాల్.. ఎంతమంది వచ్చినా నేను రెడీ

మీరు సమాచారం ఇవ్వకపోతే నా దగ్గర డాక్యుమెంట్ లేవు అనుకున్నవా. ఇవాళ్టితో గడువు ముగిసింది. అరవింద్ కుమార్, సుధీర్ రెడ్డిలు కేటీఆర్ కి వత్తసు పలుకుతున్నారు. అమెరికాలో పెట్టుబడి తెచ్చిన అంటున్నాడు. ఆయనతో ఫోటో దిగిన గాలి గాడు ఎవడో మళ్ళీ చెప్తా. పెట్టుబడి పెట్టడానికి వచ్చాడు అని చెప్పిన వాడు.. చెత్త ఉడావటానికి కూడా పనికి రాడు. అతను… సోషల్ మీడియా టీం లో ఏం చేస్తారు.. ఆయన బాగోతం ఎంటో చెప్తా మళ్ళీ. లిక్కర్ టెండర్ లో.. 100 కోట్లు లబ్ది పొందినట్టు కవితని విచారించారు. లక్ష కోట్ల ఆస్తి ఉన్న ఓఆర్‌ఆర్‌ని ఎంతకు అమ్మారు. నిబంధనలు ఏమైనా మార్చారా ..? ఢిల్లీ లిక్కర్ స్కామ్… ఓఆర్‌ఆర్‌ స్కామ్ కంటే పెద్దది. బీజేపీ.. కిషన్ రెడ్డి ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఇలాంటి ఆరోపినలే చేశారు. కిషన్ రెడ్డి కూడా ఓఆర్‌ఆర్‌లో రెండు లక్షల కోట్లు అవినీతి జరిగింది అని ఆరోపించారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న కిషన్ రెడ్డి… బండి సంజయ్.. ఎందుకు విచారణ చేయాలని అడగడం లేదు’ అని రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు.

British Airways: బ్రిటీస్ ఎయిర్‌వేస్‌లో ఐటీ ఫెయిల్యూర్.. పదుల సంఖ్యలో నిలిచిన విమానాలు..

Exit mobile version