NTV Telugu Site icon

Revanth Reddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మునుగోడు ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాయి

Revanth Reddy

Revanth Reddy

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలో బూత్ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ఇంచార్జీ మాణిక్కం ఠాకూర్, ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజ్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరవేసే విధంగా కార్యాచరణ ప్రకటించామన్నారు. బీజేపీ డిపాజిట్ జప్తు చేసే విధంగా దేశానిర్దేశం చేసామని, మునుగోడులో ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, మునుగోడులో గతంలో ఎన్నడు బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదన్నారు. మునుగోడు ప్రజలు చాలా స్పష్టంగా కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టు పక్షాన మాత్రమే నిలబడ్డారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మునుగోడు ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాయని, మరోసారి నియోజకవర్గ ఓటర్లను వంచించడానికి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజల వద్దకు వస్తున్నాయన్నారు.

 

మునుగోడు నియోజకవర్గం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హయాంలోని అన్ని రంగాలలో అభివృద్ధి జరిగిందని, టీఆర్ఎస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మునుగోడులో బీడు భూములకు సాగునీరు అందేదన్నారు రేవంత్‌ రెడ్డి. సీఎం కేసీఆర్ వివక్షపూరితంగా తెలంగాణలో పరిపాలన చేస్తున్నారని, ప్రధాని గుజరాత్ కు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని, ప్రధాని కూడా రాష్ట్రంపై చిన్న చూపు చూస్తున్నారు… నిధుల మంజూరు విషయంలో, అలసత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. గుజరాత్‌కు అవసరం లేకపోయినా బుల్లెట్ రైలు మంజూరు చేశారని ఆయన విమర్శించారు.