NTV Telugu Site icon

CM Revanth Reddy : అభ్యర్థుల ఎంపిక కోసం సెలక్షన్‌ కమిటీని ఏర్పాటు చేశాం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

పార్లమెంట్‌ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక కోసం సెలక్షన్‌ కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు సీఎం రేవంత్‌ రెడ్డి. సీఈసీ సమావేశంలో అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా… తెలంగాణ ప్రజల హక్కులపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని మోడీ ప్రభుత్వం చెప్పిందని, కానీ.. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయడంపైనే బీజేపీ దృష్టిపెట్టిందన్నారు రేవంత్‌ రెడ్డి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఇచ్చిన ఏ ఒక్క మాటను కూడా మోడీ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. పార్లమెంట్‌ అభ్యర్థుల ఎంపిక నిర్ణయం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగించామన్నారు.

అంతేకాకుండా.. ‘వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే వాళ్ళు.. ఫిబ్రవరి3 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ 25 వేలు, జనరల్, బీసీ లకు 50 వేలు చెల్లించాలి. ఫిబ్రవరి 15 నుండి 20 వరకు అభ్యర్ఫుల ఎంపిక ప్రక్రియ. ప్రతి పార్లమెంట్ కి మంత్రిని.. సీనియర్ నేతల ఇంఛార్జి గా పెట్టాము. విభజన హామీలు కేసీఆర్ అడగలేదు.. మోడీ ఇవ్వలేదు. జాతీయ ప్రాజెక్టులు రాలేదు.. Itir లేదు.. తెలంగాణ ప్రజల హక్కులపై కేంద్రం నిర్లక్ష్యం వహించింది. రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నారు..కానీ అప్పుల్లో కూరుకు పోయారు రైతులు. కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకుని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యం ని విచ్ఛిన్నం చేసే పనిలో మోడీ ఉన్నారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేస్తే.. మోడీ 100 కోట్ల అప్పు చేశారు. మూడో సారి విద్వేషం రెచ్చగొట్టి అధికారం లోకి రావాలని చూస్తున్నారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో సచ్చింది.. ప్రజలు బొంద పెట్టారు. బావ బామ్మర్ది ఉనికి కోసం పాటుపడుతున్నారు.

బిళ్ళా రంగ మాటలు చూడండి. కాంగ్రెస్ ఉండటం మంచిది కాదన్నట్టు మాట్లాడుతున్నారు. బావ బామ్మర్దిల మాటలు మోడీ ని గెలిపించేలా ఉన్నాయి. మోడీ ని కట్టడి చేయాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం. కేసీఆర్ మౌనంగా ఇంట్లో పడుకోలేదు. రహస్యంగా మోడీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. పిచ్జి పట్టినట్టు మాట్లాడుతున్నారు. బీజేపీ.. కాంగ్రెస్ ఒక్కటి ఐతయా. ఎమ్మెల్సీలు ప్రమాణం చేస్తాం అంటే.. కుట్ర తో వాయిదా వేశారు. కోదండరాం గొప్పతనం ఒకరు చెప్పాలా. కోదండరాం ని ప్రశ్నించారు అంటే.. భావ దారిద్రంకి నిదర్శనం. సోనియాగాంధీ తెలంగాణ నుంసి బరిలో దించాలి అనేది ఆలోచన. ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా కలుస్తాం. కేసీఆర్ ని మొన్నటు ఎన్నికల్లోనే బొక్కలు ఇరగా కొట్టి బోర్లా పడేశారు. కేసీఆర్ వచ్చి చేసేది ఏముంది. కేటీఆర్‌ ఏదేదో మాట్లాడతరు. పిల్లి శాపనర్దాలకు ఉట్టి తెగుతుందా. ఇరిగేషన్ శాఖపై జడ్జి నియామకం జరగ్గానే విచారణ.’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.