NTV Telugu Site icon

Revanth Reddy : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాం

Revanth Reddy

Revanth Reddy

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రామగుండం కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తామన్నారు. సొంత ఇల్లు నిర్మించుకునేందుకు సహకరిస్తామన్నారు రేవంత్‌ రెడ్డి. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఓపెన్ కాస్ట్ గనులను బంద్ చేసి అండర్ గ్రౌండ్ బొగ్గు గనులను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఓపెన్ కాస్ట్ గనులు వద్దన్నా సీఎం కేసీఆర్ ఫామ్ హౌంలో మందేసి పడుకున్నాడని ఆయన విమర్శలు గుప్పించారు. సానుభూతితో స్థానిక ఎమ్మెల్యే చందర్‌ను గెలిపిస్తే ఎరువుల కర్మాగారంలో నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలు స్వాహా చేశాడన్నారు. సింగరేణి ఎన్నికలు వస్తే సీఎం కేసీఆర్ భయపడి కోర్టు కు వెళ్ళి వాయిదాలు వేస్తున్నాడని, సీఎం కేసీఆర్ మొనగాడు అయితే ఎన్నికలు పెట్టమన్నారు సీఎం కేసీఆర్‌.

Also Read : Revanth Reddy: మీటింగ్ పెడితే కరెంట్ కట్ చేస్తారా.. మీ నరాలు కట్ అవుతాయి.. రేవంత్ వార్నింగ్

చీకట్లో మగ్గుతున్న రామగుండంలో వెలుగులు నిండాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. ఇసుక, బొగ్గు, బూడిద ఏదీ వదలకుండా దోచుకుని ఇక్కడి ఎమ్మెల్యే బంధిపోటు దొంగలా మారిండని ఆయన వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల కుటుంబానికి కప్పం కడుతుండు కాబట్టే మళ్లీ ఎమ్మెల్యేకు టికెట్ కేటాయించిండని, సింగరేణి కార్మికుల ఎన్నికలను కోర్టుకు పోయి వాయిదా వేయించిండ్రన్నారు. కేసీఆర్ మొగోడే అయితే సింగరేణి ఎన్నికలను ఎందుకు జరపలేదు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నెరవేరాలంటే కాంగ్రేస్ అధికారంలోకి రావాలని, మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలని రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు.

Also Read : Kanna Laxminarayana: ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలన్నా, స్వేచ్ఛగా బ్రతకాలన్నా.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి..!