Revanth Reddy : దుర్మార్గాలకు రాచ గురువు కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. అయితే నిన్న మునుగోడు ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి… కేసీఆర్‌కి లాభం చేకూర్చ్చినట్టు చెప్పారని, ఇద్దరి మధ్య లోపాయి కారి ఒప్పందం ఏంటి..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలన్నారు. టీఆర్ఎస్ కి ఓటేస్తే డిండి ప్రాజెక్ట్ ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పాలి. 8 ఏండ్లలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఎందుకు పెండింగ్ లో పెట్టారు. దీనిపై ఎందుకు సమాధానం చెప్పలేదు కేసీఆర్. చర్ల గూడెం ముంపు బాధితులు ఆందోళన చేస్తుంటే వాళ్ళ నీ అరెస్ట్ చేయించారు కానీ.. సమస్య కి పరిష్కారం చూపలేదు. నియోజక వర్గ సమస్యల ప్రస్తావన లేకుండా.. కేసీఆర్ తన చేత కానీ తనం బయట పెట్టుకున్నారు.
Also Read
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
మునుగోడులో డిగ్రీ.. జూనియర్ కాలేజీలు ఏమయ్యాయి..? బీజేపీ దాడుల మీద.. మోడీ మీద మాట్లాడిన కేసీఆర్… జనం సమస్య లు ఎందుకు మాట్లాడలేదు. కేసీఆర్ నీ మోడీ ఆదర్శంగా తీసుకుని పార్టీ ఫిరాయింపులు…చేస్తుంది. కేసులు పెట్టుడు.. ఇసుక అమ్ముకునుడు… వడ్లు కొనేది మీ వాళ్ళే. ఆఖరికి అంగన్ వాడికి పంపే గుడ్ల వ్యాపారం కూడా మీదే. నయీం డంప్ లో దొరికిన డబ్బులు దిగమింగింది నువ్వే. బీజేపీ.. కి ఉన్న ఏక లింగంని మూడు చేసింది కేసీఆర్. మూడు చోట్ల గెలిపించింది కేసీఆర్. మా సర్పంచ్..ఎంపీటీసీ లను బెదిరించి, లొంగ దిసుకున్నరు. బీజేపీ.. టీఆర్‌ఎస్ ఒకటే. మనిషి రక్తం మరిగిన పులి లెక్క.. బీజేపీ తెలంగాణ మీద పడింది. లేని ప్రత్యర్ధిని సృష్టించినది కేసీఆర్ కాదా..? దుర్మార్గాలకు రాచ గురువు కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!