NTV Telugu Site icon

Revanth Reddy : నిజాం నిరంకుశ పాలనపై ఎక్కుపెట్టిన ఫిరంగి పరకాల

Revanth

Revanth

పరకాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనపై ఎక్కుపెట్టిన ఫిరంగి పరకాల అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్ పుట్టిన గడ్డ అని, అలాంటి ఈ గడ్డను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసే బాధ్యత మాది అని ఆయన హామీ ఇచ్చారు. మచ్చలేని , అవినీతి మరక లేని నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి అని, కేసీఆర్ మతి తప్పి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుండో తెలియదన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపడుతుండు అని రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. దొరల రాజ్యం కావాలా? ఇందిరమ్మ రాజ్యం కావాలా పరకాల ప్రజలు తేల్చుకోవాలన్నారు రేవంత్‌ రెడ్డి.

Also Read : Election Commission: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రూ.1760 కోట్లు పట్టివేత.. తెలంగాణలోనే అత్యధికం

అంతేకాకుండా.. ఆనాడు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యమని ఆయన గుర్తు చేశారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు ఉచితంగా ఇచ్చే రాజ్యం ఇందిరమ్మ రాజ్యమని ఆయన వెల్లడించారు. వేలాది ఎకరాల దొరల భూములను సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు పంచింది ఇందిరమ్మ రాజ్యమని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి ఇందిరమ్మ రాజ్యంలోనే జరిగిందని, ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపట్టిన కేసీఆర్ ముక్కు నేలకురాసి క్షమాపణ చెప్పాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. సోనియమ్మ మాటంటే శిలాశాసనమని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచినట్లే అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

Also Read : Hyderabad: మైనర్‌ బాలిక ఆచూకీ లభ్యం.. 5 రోజులు, 200 సీసీ కెమెరాలు వడపోసిన హెడ్‌ కానిస్టేబుల్‌

Show comments