NTV Telugu Site icon

Revanth Reddy: అసెంబ్లీ చర్చలకు రాని దద్దమ్మలు 4 గంటలు మీడిలో కూర్చున్నారు

Revanth Reddy Cm

Revanth Reddy Cm

అసెంబ్లీ చర్చలకి రాని దద్దమ్మలు 4గంటలు మీడియాలో కూర్చున్నారని కేసీఆర్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చకు సిద్ధమా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ అద్భుతం అంటున్నాడని.. కాళేశ్వరం దగ్గరనే చర్చ పెడుదం రా.. అని సవాల్ విసిరారు. వరంగల్ జన జాతర సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మేము కట్టిన ప్రాజెక్టు ను చూద్దాం.. మీరు కట్టిన ప్రాజెక్టులను చూద్దాం.. ఏవి ఎలా ఉన్నాయో తేలుతాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదని విమర్శించారు. ప్రధాని 20 కోట్లు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి.. 7 కోట్ల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. సరిహద్దులో సైనికులు ఎలా కొట్లడుతారో.. ఢిల్లి సరిహద్దులో రైతులు అలా కోట్లాడి మోడీ మెడలు వంచి నల్ల చట్టాలని రద్దు చేయించుకున్నారని తెలిపారు. నరేంద్ర మోడీ చేతిలో ప్రతి విషయంలో మోసపోయమన్నారు.

READ MORE: GT vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్..

తెలంగాణ రాష్ట్రాన్ని పట్టిన పీడ పోవాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే్లను గెలిపించాలని కోరినట్లే చేశారు.. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తానికి సాగు, త్రాగు నీరు ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సాగు నీటి ప్రాజెక్టులతో పాటు ఓటి ప్రాజెక్టు .. ఇండస్ట్రియల్ కారిడార్ తెస్తామన్నారు. టెక్ట్స్ టైల్ పార్క్ ను అభివృద్ధి చేస్తామని..నగరంలో అండర్ డ్రైనేజీ నిర్మాణం చేపడతామన్నారు. వరంగల్ లో ఎయిర్ పోర్ట్ నిర్మాణతోపాటు పట్టణాన్ని పట్టి పిడిస్తున్న చేతను తొలగించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. చెత్తతో విద్యుత్ తయారు చేసే ప్రాజెక్టు ప్రారంభిస్తానన్నారు.కాకతీయ యూనిర్సిటీని ప్రక్షాళన చేస్తానని చెప్పారు. ఆగిపోయిన ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేస్తానని తెలిపారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదన్నారు. డీజిల్ పెట్రోల్ ధరలను పెంచారని విమర్శించారు. భూములు గుంజుచుకున్న అరురి రమేష్ కు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు. కడియం శ్రీహరి కోరి కాంగ్రెస్ లోకి రాలేదని.. తాము పిలిచి టికెట్ ఇచ్చామని స్పష్టం చేశారు. దేవుడిని గుడిలో పెట్టి.. భక్తి గుండెల్లో పెట్టుకున్న చరిత్ర ఉన్న మనం దేవుడి పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పంద్రాగష్టు లోపు తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలని హరీష్ రావుకు సవాల్ విసిరారు.