CM Revanth Reddy: రాజ్యాంగంపై బీజేపీ కుట్ర చేస్తోంది.. తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: భారత రాజ్యాంగంపై బీజేపీ కుట్ర చేస్తోందని.. ఆ కుట్రలను తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షా మార్చ్’ నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రాజ్యాంగంపై కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి రాజ్యాంగాన్ని కాపాడేందుకే తమ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. తాము పాలకులం కాదని, ప్రజాసేవకులమని చెబుతూ, నియంత పాలకులు కావాలో లేక ప్రజల కోసం పోరాడేవారు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు.
పాలన రాజుల చేతిలో కాకుండా ప్రజల చేతిలో ఉండాలన్నదే రాజ్యాంగ ఆశయమని రేవంత్‌రెడ్డి తెలిపారు. గతంలో పేదల ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి మోడీ గెలిచారని, మూడోసారి భాషా, ప్రాంతీయ విభేదాలు సృష్టించి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఎన్నికల్లో ఈడీ (ED), సీబీఐ (CBI), ఐటీ (IT) సంస్థలను దుర్వినియోగం చేశారని, నాలుగోసారి కూడా అధికారం దక్కించుకోవడం కోసం రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. పేదలు, దళితులు, గిరిజనుల ఓట్లను తొలగిస్తున్నారని, ఇప్పటికే 13 కోట్ల ఓట్లు తొలగించి మరో 7 కోట్ల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, బీజేపీ వ్యతిరేక ఓటు హక్కును దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు.
Also Read
- కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
- Wanaparthy: పెళ్లి విందుకు ఆహ్వానం లేకుండా వెళ్తున్నారా? జైలు, జరిమానా తప్పదంటూ వార్నింగ్ బ్యానర్..
- Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో సిరా వివాదం.. బ్యాలెట్ బాక్సుల వద్ద కలకలం
బ్రిటిష్ హయాంలో సైమన్ కమిషన్ తీసుకువచ్చినట్లే, ఇప్పుడు బీజేపీ జ్ఞానేశ్వర్ కమిషన్ తీసుకువచ్చిందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. నాడు భగత్ సింగ్ పోరాడినట్లుగా నేడు రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. గాంధీ వారసులకు, గాడ్సే వారసులకు మధ్య పోరాటం జరుగుతోందని, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు పాండవుల పక్షాన ఉంటే, మోడీ, అమిత్ షా కౌరవ పక్షంలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. గాడ్సే వారసులు ఓడిపోవాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోటి ఓట్లు, 90 అసెంబ్లీ సీట్లు, 15 ఎంపీ సీట్లు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రాజ్యాంగంపై బీజేపీ కుట్ర చేస్తోంది.. తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
Vivo X500 Series: వివో X500 సిరీస్ భారత్‌లో లాంచ్.. 200MP కెమెరా, 7800mAh బ్యాటరీ, ధర, ఫీచర్స్ ఇవే!
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Wanaparthy: పెళ్లి విందుకు ఆహ్వానం లేకుండా వెళ్తున్నారా? జైలు, జరిమానా తప్పదంటూ వార్నింగ్ బ్యానర్..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
ట్రెండింగ్
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!
-
Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్‌కు చేరిన అంచనాలు!