Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Revanth Reddy Comments On Ias Officers

CM Revanth Reddy : నిబద్ధత ఉన్న ఆఫీసర్లు ఎక్కడ ఉన్నా పోస్టింగ్‌లు వస్తాయి

Published Date :February 16, 2025 , 7:57 pm
By Gogikar Sai Krishna
  • ఐఏఎస్ అధికారులపై రేవంత్ రెడ్డి విమర్శలు
  • పాలనలో మార్పు అవసరం – ప్రజలకు చేరువ కావాలని సూచన
  • శంకరన్, శేషన్, మన్మోహన్ సింగ్‌లను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు
CM Revanth Reddy : నిబద్ధత ఉన్న ఆఫీసర్లు ఎక్కడ ఉన్నా పోస్టింగ్‌లు వస్తాయి
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఐఏఎస్ అధికారులు ఎంతో కట్టుదిట్టంగా పని చేసేవారని, కానీ ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత అధికారి వర్గం కేవలం ఏసీ గదుల్లోనే పరిమితం అయ్యారని, ప్రజలకు అందుబాటులో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో జరిగిన ‘లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారుల అనుభవాలను నేటి ఐఏఎస్‌లు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గత ఐఏఎస్ అధికారులు ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను నేరుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వ్యాఖ్యానించారు.

గతంలో ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులకు ప్రామాణిక సమాచారాన్ని అందించేవారని, రాజకీయ నిర్ణయాల్లో లాభనష్టాలను విశ్లేషించి వివరించేవారని, కానీ ఇప్పుడు ఆ విధానం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు. రాజకీయ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, దాని ప్రభావాన్ని ప్రభుత్వం నడిపించే అధికారులే అర్థం చేసుకోవాలని, కానీ ఇప్పుడు అలాంటి దృక్పథం తగ్గిపోయిందని అన్నారు.

 
Redmi Book Pro: రెడ్ మీ నుంచి ప్రీమియం ల్యాప్ టాప్.. త్వరలో మార్కెట్‌లోకి
 

శంకరన్, టీఎన్ శేషన్, మన్మోహన్ సింగ్‌ల వంటి అధికారులు తమ సేవల ద్వారా దేశానికి ఎంతో కొంత న్యాయం చేశారని, ఐఏఎస్ అధికారులు వారి మార్గంలో నడవాలని సూచించారు. శంకరన్ పేదల కోసం పనిచేసిన గొప్ప అధికారి అని, శేషన్ పారదర్శక ఎన్నికల నిర్వహణకు కృషి చేసిన వ్యక్తి అని, మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను బలంగా నిలబెట్టిన నేత అని గుర్తుచేశారు.

ఒక ఐఏఎస్ అధికారి తన పని ప్రామాణికంగా నడిపించుకుంటే ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాడని అన్నారు. నిజమైన సేవగల అధికారి రాజకీయ నాయకులకంటే ప్రజల్లో ఎక్కువ గుర్తింపు పొందుతాడని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న వారధిగా ఐఏఎస్ అధికారులు తమ పాత్రను సమర్థవంతంగా పోషించాలని, పాలనలో పారదర్శకత ఉండాలంటే అధికారులకు సమర్థమైన మార్గదర్శకత్వం అవసరమని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న ఐఏఎస్‌ అధికారులు ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనను మళ్లీ తీసుకురావాలని పిలుపు ఇచ్చారు. పాలనలో నిబద్ధత చూపే వారికే గుర్తింపు ఉంటుందని, నిర్లక్ష్య ధోరణిని వీడి ప్రజల అవసరాలను అర్థం చేసుకుని పనిచేయాలని సూచించారు. పేదలకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చూడాలని, సామాన్య ప్రజలకు దగ్గరగా ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. అధికారుల ఆలోచనలో మార్పు రావాలని, వారి విధానం పూర్తిగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని సూచించారు.

 
Haryana Governor: దేశంలో పేదరికం పోవాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించిన వ్యక్తి జ్యోతిరావు పూలే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • administrative reforms
  • Civil Services
  • ias officers
  • revanth reddy
  • Telangana Politics

తాజావార్తలు

  • Insurance Price: తగ్గనున్న ఇన్సురెన్స్ ప్రీమియం ధరలు.. మోటార్, హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్‌లు ఇక తక్కువ ధరలోనే..

  • US-Iran ceasefire: అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్..

  • Nayan Sarika: ‘రాకాసా’తో మరో హిట్ ఖాతాలో వేసుకున్న క్రేజీ బ్యూటీ..

  • Village Volunteer: ‘ప్రతీ గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమిస్తాం’: మంత్రి తుమ్మల

  • Cameron Green Trolls: 18, 2, 4.. 25 కోట్లు బొక్క.. కామెరూన్‌ గ్రీన్‌ను ఎలిమినేట్ చేయండి సర్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions