Site icon NTV Telugu

Revanth Reddy : పేపర్ అవుట్‌కు, పేపర్ లీక్‌కు చాలా తేడా వుంది

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ పేపర్‌ లీకేజీలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. దీంతో రేవంత్‌ రెడ్డికి మంత్రి కేటీఆర్‌ పరువు నష్టం నోటీసులు ఇచ్చారు. అయితే.. దీనిపై రేవంత్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి ఎన్టీవీతో చిట్‌ చాట్‌లో మాట్లాడుతూ.. పేపర్ లీక్, పేపర్ అవుట్ కు తేడా ఉందన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయ్యిందని, పదో తరగతి పేపర్ అవుట్ అయ్యిందన్నారు. పదో తరగతి పరీక్షలు రాసే వాళ్ళు పరీక్షా కేంద్రాల్లోనే ఉండగానే పేపర్ అవుట్ అయ్యిందని, పేపర్ అవుట్ కు, పేపర్ లీక్ కు చాలా తేడా వుందన్నారు.

Also Read : Palla Rajeshwar Reddy : అవినీతి రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉంది

టీఎస్పీఎస్సీ పేపర్.. పరీక్షకు చాలారోజుల ముందే బయటికొచ్చిందని, లీక్ కు అవుట్ కు వేరువేరు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేస్తారని ఆయన అన్నారు. బండి సంజయ్ పై పేపర్ అవుట్ కేసు పెట్టిన అది ఉత్తదే అని, టీఎస్సీ్ఎస్సీ పేపర్ లీక్ లో రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ లే కాదు.. చాలామంది వున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీ బోర్డునే రద్దుచేసి పరీక్షలు పెట్టాలని, టీఎస్పీఎస్సీ పేపర్లు దొంగతనం చేసినోళ్లను పట్టుకోకుండా కొనుగోలు చేసి రాసినోళ్లను పట్టుకుంటున్నారని రేవంత్‌ రెడ్డి అన్నారు. అసలు దొంగలను పట్టుకోవాల్సిన సిట్.. ముద్దాయిలు వేరు, సాక్షులు వేరని, చైర్మన్, సెక్రెటరీ, సభ్యులను సాక్షులుగా పిలిచి అడుగుతున్నారన్నారు. కాన్ఫిడెన్షనల్ విషయాలు కేటీఆర్‌కు ఎట్లా తెలుస్తున్నాయి. సిట్ అధికారులు చెబుతున్నారా..? అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

Also Read : Maoist On Rape Case: అత్యాచారం కేసులో కోర్టు తీర్పు.. ఉద్యమించాలని మావోయిస్టుల పిలుపు

Exit mobile version