Site icon NTV Telugu

Revanth Reddy : ఈటలకు రేవంత్ సవాల్.. ప్రమాణం చేస్తా

Revanth Reddy

Revanth Reddy

రేపు సాయంత్రం 6 గంటలకు భాగ్యలక్ష్మి టెంపుల్ కి వస్తానని, ఈటల రాజేందర్ కూడా రావాలని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. ఇటీవల ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. ప్రమాణం చేస్తానని, బీఆర్‌ఎస్‌ నుండి డబ్బులు తీసుకోలేదు అని గర్భగుడిలో నిలబడి ఒట్టేస్తానన్నారు. రాజేందర్ రావాలి దిగజారి మాట్లాడొద్దన్నారు. దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, భాగ్యలక్ష్మి టెంపుల్ వద్దు అంటే.. తడి బట్టలతో ఏ గుడికి అయినా వస్తా అని ఆయన అన్నారు. నువ్వు రా ఈటల అని, దేవుడి మీద ఒట్టేసి చెప్తానన్నారు. అంతేకాకుండా.. ‘మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి పార్టీలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల నాయకులే డబ్బులు ఇచ్చారు.

Also Read : Ganga Pushkaralu: గంగానది పుష్కరాలకు సర్వం సిద్ధం

నేనే అందరిని పిలిచి సాయం అడిగా. ఉత్తమ్.. భట్టి సమక్షంలో సాయం ఆడిగాము. పార్టీ కష్టకాలం లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు సాయం అందించారు. ఈటల దేవుణ్ణి నమ్ముతాడా.. నేను దేవుని నమ్ముతా.. రా ప్రమాణం చేద్దాం.. భాగ్యలక్ష్మి గర్భగుడిలో ప్రమాణం చేస్తా. నా నిబద్ధత ని.. నీచ రాజకీయం కోసం ఈటెల క్షమించరాని నేరం చేశారు. ఈటల రేపు భాగ్యలక్ష్మి గుడికి రావాలి. చిల్లర ఆరోపణలు చేసే వారు నాకు చిత్తు కాగితం లాంటి వాళ్ళు. ఈటల నిరూపించాలి ఆరోపణలు.. నేను ఏందో రాజేందర్ కి తెలుసు.. ఈటల తాను ఏందో ఆయనకు తెలిసి ఉండాలి. మేము మునుగోడు లో పెట్టిన ఖర్చు… పార్టీలో ఉన్న బడుగు..బలహీన వర్గాలు నాయకులు ఇచ్చిన సాయమే’ అని ఆయన అన్నారు.

Also Read : Mango Special: దేశంలోని ఏ రాష్ట్రంలో ఏ రకాలు లభిస్తాయో తెలుసా?

Exit mobile version