Site icon NTV Telugu

Revanth Reddy : త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీది

Revanth Reddy Congres

Revanth Reddy Congres

గాంధీ భవన్ ఆవరణలో దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్రిస్టమస్ వేడుకలు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి తదితరులు హ‌జ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మీది.. రాజ్యాంగ కమిటీ చైర్మన్‌గా అంబేద్కర్‌ని పెట్టింది కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. అంబేద్కర్‌ వాదీ ఖర్గేని అధ్యక్షుడిని చేసింది సోనియాగాంధీ అని ఆయన అన్నారు. ఇలాంటి ధైర్యం బీఆర్‌ఎస్‌కి కానీ..బీజేపీ కి కానీ ఉందా..? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Mahila vedika: మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఇక మహిళా వేదికలు.. వారికి రుణ మాఫీ..!
కాంగ్రెస్ దళిత బిడ్డ భట్టిని సీఎల్పీ నేతని చేస్తే… కేసీఆర్ ఓర్వలేదని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘ఓర్వలేక ప్రతిపక్ష నాయకుడి హోదా లేకుండా చేశారు. సీలింగ్ భూములు కాంగ్రెస్ ఇస్తే… కేసీఆర్ లాక్కున్నారు. బంగారు లక్ష్మణ్‌ని బీజేపీ ఒక్కసారి అధ్యక్షుడు అయితే లక్ష లంచం కేసులో ఇరికించింది. బీఆర్‌ఎస్‌ దళితుణ్ణి సీఎం చేస్తా అని మాట తప్పింది. రాహుల్ గాంధీ యాత్ర బడుగు..బలహీన వర్గాల కోసమే. త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీది. పదవులు చూడని కుటుంబమా… గాంధీ కుటుంబం. బీఆర్‌ఎస్‌కి ఓటెస్తే బీజేపీకి వేసినట్టే. కేసీఆర్ కి వేస్తున్నాం అనుకోకండి. ఢిల్లీలో అది మోడీకి పడే ఓటే. . అన్ని శక్తులు కాంగ్రెస్ తో కలిసి రండి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version