Revanth Reddy: రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చానని, హాత్ సే హాత్ జోడో యాత్రలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. 20 శాతం మైనార్టీలు, 80శాతం మెజార్టీలను విభజించి పాలించిన విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. విభజించు పాలించు విధానంతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ ప్రయత్నాన్ని.. ప్రజలకు చాటి చెప్పేలాగా రాహుల్ గాంధీ యాత్ర చేశారన్నారు. రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి పల్లెకు, గూడేనికి చేరేలా కార్యక్రమం చేయాలని ఏఐసీసీ ఇంఛార్జి ఇచ్చిన ఆదేశాలతో ఈ యాత్ర ప్రారంభించినట్లు రేవంత్ వెల్లడించారు. రాచరిక వ్యవస్థకు, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా అప్పుడు సమ్మక్క సారలమ్మ చేసిన పోరాట స్ఫూర్తితోనే ఈ యాత్ర మేడారంలో ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
వైఎస్సార్‌లా చేవెళ్ల సెంటిమెంట్ లాగానే.. సీతక్క సెంటిమెంట్‌తో ఈ యాత్ర ఇక్కడి నుంచి ప్రారంభించినట్లు చెప్పారు. ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇంత మంది వచ్చారు అంటే ఈ యాత్ర విజయావంతం అయినట్లేనన్నారు. కేసీఆర్ తీరు చూస్తుంటే మళ్లీ రాచరిక వ్యవస్థ గుర్తుకొస్తుందన్నారు. తెలంగాణ కోసం బలిదానం చేసిన 1200 మంది కుటుంబ సభ్యుల ఏడుపులు వినిపిస్తున్నాయని రేవంత్ అన్నారు. వారి బలి దానాలము మట్టిలో కప్పేసే ప్రయత్నాలు చేస్తుంటే.. బరిద్దామా అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Kishan Reddy: తెలంగాణ బడ్జెట్ ఓ గిమ్మిక్కు.. ఇందులో అన్నీ అబద్ధాలే..
భర్తకు పింఛన్ ఇస్తే భార్యకు పింఛన్ ఇవ్వకపోవడం సంక్షేమమా అంటూ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరకపోవడం వల్ల పదివేల మంది రైతులు ఉరివేసుకొని చనిపోయిన తీరు సంక్షేమమా అంటూ మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం అని ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం, నిరుద్యోగం పెంచడం సంక్షేమమా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సీఆర్ చేస్తున్న అప్పుల లెక్క తీసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి రూ.20వేల కోట్ల నిధులు రావాలని.. మరి 20000 కోట్లు ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టారా అంటూ రేవంత్ ఆరోపించారు. రూ.25 లక్షల కోట్లు ఎక్కడ పోయాయని, ఎవరు దోచుకున్నారు రాబందుల సమితి దోచుకోలేదా అంటూ విమర్శించారు. కేసీఆర్ తీరుతో పదిమంది పెట్టుబడిదారులు బాగుపడ్డారని, 90 శాతం పేదలు నష్టపోయారని ఆయన ఆరోపణలు చేశారు.
చేంజ్ అనే నినాదంతో ఈ యాత్ర చేపడుతున్నామని.. ప్రతి వర్గాల్లో మార్పు రావాలంటే ఈ ప్రభుత్వం పోవాలన్నారు. చేంజ్ రావాలంటే ప్రతి వారి ఆలోచనల్లో మార్పు రావాలి, చేంజ్ రావాలన్నారు. కేసీఆర్‌కి ఏమి తెలియదు.. ఎవ్వడు చెప్పిన వినడు.. ఇలాంటి కేసీఆర్ మనకు అవసరమా అంటూ ప్రజలను ఉద్దేశించి రేవంత్ ప్రసంగించారు.