NTV Telugu Site icon

Telangana: తెలంగాణలో ప్రారంభమైన రాజీనామాల పర్వం..

Telangana

Telangana

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్ననే వచ్చాయి.. అయితే, ఈ రోజు రాజీనామాల పర్వం ప్రారంభమైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో రెండు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ, ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవడంతో.. ఇన్నాళ్లు కేసీఆర్ సర్కార్ తో ప్రయాణం చేసిన నామినేటెడ్ పదవుల్లో ఉన్న పలువురు తమ పోస్టులకు రిజైన్స్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా ఉన్న దేవులపల్లి ప్రభాకర్ రావు తన పదవికి రీజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. 2014 జూన్ 5న జెన్ కోం సీఎండీగా పదవి బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ రావు.. అదే సంవత్సరం 25న ట్రాన్స్ కో ఇంఛార్జ్ గా ప్రభుత్వం నియమించింది.

Read Also: BRS Meeting: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ మీటింగ్‌.. మాల్లారెడ్డి డుమ్మా..!

అయితే, ప్రభుత్వం మొదట ప్రభాకర్ రావును రెండేళ్ల పదవీ కాలానికే సీఎండీగా నియమించింది.. ఆ తర్వాత తన పదవీ కాలాన్ని పొడిగిస్తూ వెళ్లింది.. కాగా, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటంతో తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కాగా.. ప్రభాకర్ రావు జెన్ కో సంస్థకు మొత్తం 54 ఏళ్ల పాటు తన సేవలను అందించారు. ఇక మరోవైపు, సాంస్కృతిక సలహాదారుడిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ రమణాచారి కూడా తన పదవికీ రిజైన్ చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎస్‌ శాంతికుమారికి పంపించారు. అలాగే, కాగా, ఇంటెలిజెన్స్ ఓఎస్డీ ప్రభాకర్ రావు సైతం రాజీనామా చేశారు. గత కొన్నాళ్లుగా ఇంటెలిజెన్స్ లో ఓఎస్డీ ఆయన కొనసాగుతున్నారు.

Read Also: Kiran Verma: రెండేళ్లలో 17,700 కి.మీ. పాదయాత్ర.. 26,722 యూనిట్ల రక్త సేకరణ..

కాగా, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు రాజీనామా చేశారు. మూడేళ్లపాటు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా రాధా కృష్ణన్ రావు పని చేశారు. పదవి విరమణ తర్వాత టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా ఆయన పని చేశారు. నోటిఫికేషన్ తర్వాత రాధా కిషన్ రావును టాస్క్ ఫోర్స్ నుంచి ఎన్నికల కమిషన్ తప్పించింది. పలువురు రిటైర్ట్ ఉద్యోగులు, ఐఏఎస్‌లను బీఆర్ఎస్ ప్రభుత్వం అదే శాఖలో నామినేటెడ్ పదవుల్లో కొనసాగించింది. ఇప్పుడు, వీళ్ల పని తీరుపై గతంలో రేవంత్ రెడ్డి పలు మార్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కాగా.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కన్పిస్తుండటంతో.. వాళ్లందరూ రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, సాయంత్రంలోపు మరి కొంత మంది కూడా రాజీనామాలు చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Read Also: South Central Railway: మిచౌంగ్ తుఫాన్‌ ఎఫెక్ట్.. 151 రైళ్లు రద్దు

తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు వరుసగా రాజీనామా చేస్తున్నారు. రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. రాజీనామా లేఖలు పంపి వారు వీరే.. కార్పొరేషన్ల చైర్మన్లు డా .దూది మెట్ల బాలరాజ్ యాదవ్, రవీందర్ సింగ్, డా. వాసుదేవ రెడ్డి, మన్నే క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్ గౌడ్, పాటి మీద జగన్ మోహన్ రావు, అనిల్ కూర్మాచలం, గజ్జెల నగేష్, మేడె రాజీవ్ సాగర్, డా.ఆంజనేయులు గౌడ్, సతీష్ రెడ్డి, రామచంద్ర నాయక్, గూడూరి ప్రవీణ్, వాల్యా నాయక్ తో పాటు మరికొందరు ఉన్నారు.