NTV Telugu Site icon

Karnataka High Court: ఆ ఉద్యోగులు పుట్టిన తేదీని మార్చుకోలేరు.. కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయం

Karnataka High Court

Karnataka High Court

పదవీ విరమణ కేసులో కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి తన పదవీ విరమణ తర్వాత తొలుత నమోదు చేసిన పుట్టిన తేదీని మార్చుకోలేరని హైకోర్టు పేర్కొంది. అసలు ఈ అంశం గురించి పూర్తిగా తెలుసుకుందాం.. ఈ కేసు తయారీ యూనిట్‌లో పనిచేస్తున్న ఉద్యోగికి సంబంధించినది. ఉద్యోగి 1983 -2006 వరకు కంపెనీలో పనిచేశారు. కంపెనీలో ఉద్యోగిని నియమించినప్పుడు.. ఆయన తన పుట్టిన తేదీని 10 మార్చి 1948గా పేర్కొన్నారు. అయితే తన పుట్టిన తేదీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు జోడించలేదు.

READ MORE: Kolkata Doctor case: నిందితుడి గురించి వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు

దీంతో 2006 ఏడాదిలో 58 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున.. యాజమాన్యం పదవీ విరమణ ప్రకటించింది. దీనిపై ఉద్యోగి అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఉద్యోగికి సంబంధించిన పాఠశాల సర్టిఫికేట్, ప్రావిడెంట్ ఫండ్ నుంచి పొందిన సమాచారం ఆధారంగా తన పుట్టిన తేదీ 30 మార్చి 1952గా ఉందని తెలిపారు. తాజాగా ఆయన తన జనన ధృవీకరణ పత్రాన్ని పొందారు. అందులో పుట్టిన తేదీ 30 మార్చి 1952గా ఉంది. దీని తర్వాత ఆయన మరో నాలుగేళ్లు కంపెనీల పనిచేయాల్సి ఉంది. కానీ కంపెనీ దీనికి అంగీకరించలేదు.

READ MORE:Assam Police: భారత్లోకి ప్రవేశించేందుకు నలుగురు బంగ్లాదేశీయులు యత్నం..

ఉద్యోగి ఈ దరఖాస్తును యాజమాన్యం అంగీకరించలేదు. కంపెనీలో నమోదైన ఉద్యోగి పుట్టిన తేదీ సరైనదేనని యాజమాన్యం వాదించింది. ఈ విషయంపై రిటైర్డ్ ఉద్యోగి దిగువ కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ ఆయన అభ్యర్థన తిరస్కరించబడింది. దీంతో ఆ ఉద్యోగి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో జస్టిస్ ఎం.జి. ఎస్. కమల్ కేసును విచారించారు. పదవీ విరమణ చేసిన రెండేళ్ల తర్వాత సదరు వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారని, దీంతో పిటిషనర్ దావాపై అనుమానం కలుగుతోందని కోర్టు పేర్కొంది.

READ MORE:Pawan Kalyan: భారత అంతరిక్ష రంగ పితామహుడి జీవితం స్ఫూర్తిదాయకం

పదవీ విరమణ తర్వాత పుట్టిన తేదీని మార్చలేమని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను విచారణ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. ఉద్యోగిగా ఉన్నప్పుడు తన పుట్టిన తేదీని మార్చుకునే అవకాశం ఉందని.. అయితే అది జరగలేదని హైకోర్టు పేర్కొంది. ప్రావిడెంట్ ఫండ్, స్కూల్ సర్టిఫికెట్లలో పుట్టిన తేదీ సరైనదేనని హైకోర్టు అభిప్రాయపడింది. పదవీ విరమణ పొందిన వ్యక్తి అనవసర ప్రయోజనాలను పొందేందుకు ఈ దావా వేసినట్లు కూడా పేర్కొంటూ… పిటిషనర్ ను కొట్టేసింది.

Show comments