Retail Inflation Data: 15 నెలల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం.. జూలైలో 7.44శాతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Retail Inflation Data: టమాటాలతో సహా ఆహార పదార్థాల ధరల్లో తీవ్ర పెరుగుదల కారణంగా జూలై 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ లాంగ్ జంప్ చేసింది.. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతం దాటింది. సీపీఐ ద్రవ్యోల్బణం జూలైలో 7.44 శాతంగా ఉంది. ఇది జూన్ 2023లో 4.81 శాతంగా ఉంది. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్ 6 శాతం ఎగువ స్లాబ్‌ను దాటింది. పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 7.63 శాతంగా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 7.20 శాతంగా ఉంది.
ఖరీదైన ఆహార పదార్థాలు
రిటైల్ ద్రవ్యోల్బణం రేటుకు సంబంధించి గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. జూలైలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రేటులో భారీ పెరుగుదల ఉంది. జులైలో ఆహార ద్రవ్యోల్బణం 11.51 శాతంగా ఉండగా, జూన్‌లో 4.49 శాతంగా ఉంది. అంటే ఒక్క నెలలోనే ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. అక్టోబర్ 2020 తర్వాత ఆహార ద్రవ్యోల్బణంలో పెరుగుదల ఇదే అత్యధిక స్థాయి.
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
Read Also:Mamata Banerjee: కేంద్రంలో రాజకీయ స్థానం అవసరం లేదు… అదొక్కటే లక్ష్యమంటున్న మమతా బెనర్జీ
గణనీయంగా పెరిగిన కూరగాయల ద్రవ్యోల్బణం
జూలై నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 37.34 శాతంగా ఉంది. ఇది జూన్ 2023లో -0.93 శాతంగా ఉంది. అంటే, ఒక నెలలో ఆకుకూరలు, కూరగాయల ద్రవ్యోల్బణం రేటు 38 శాతానికి పైగా పెరిగింది. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం జూన్‌లో 10.53 శాతంగా ఉన్న 13.27 శాతంగా ఉంది. సుగంధ ద్రవ్యాల ద్రవ్యోల్బణం జూన్‌లో 19.19 శాతంగా ఉన్న 21.53 శాతంగా ఉంది. పాలు, దాని సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం జూన్‌లో 8.56 శాతంగా ఉన్న 8.34 శాతంగా ఉంది. ఆహార ధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం జూన్‌లో 12.71 శాతంగా ఉన్న 13.04 శాతంగా ఉంది. చమురు, కొవ్వుల ద్రవ్యోల్బణం జూన్‌లో -18.12 శాతం, -16.80 శాతంగా ఉంది.
గత ఏడాది మే 2022లో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతం దాటింది. ఆ తర్వాత ఆర్బీఐ రెపో రేటును పెంచడం ప్రారంభించింది. రెపో రేటును 4 శాతం నుంచి 6.50 శాతానికి పెంచారు. మే 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4.25 శాతానికి తగ్గినప్పుడు ఖరీదైన ఈఎంఐ నుండి ఉపశమనం లభిస్తుందనే ఆశ ఉంది. అయితే మళ్లీ రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 7 శాతం దాటింది. దీంతో ఖరీదైన ఈఎంఐ నుంచి ఉపశమనం లభిస్తుందన్న ఆశ ప్రస్తుతానికి ముగిసినట్లే. ఎందుకంటే ద్రవ్యోల్బణం రేటు ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్ కంటే ఎక్కువగా ఉంది.
Read Also:Kishan Reddy: కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కి వేసినట్టే.. మజ్లిస్ చేతికి స్టీరింగ్..!
తాజావార్తలు
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!