NTV Telugu Site icon

Retail inflation: 4 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం.. కారణమిదే..?

Retail

Retail

ఆహార వస్తువుల ధరల పెరుగుదల కారణంగా జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.08 శాతానికి పెరిగింది. మే నెలలో ద్రవ్యోల్బణం 4.75 శాతంగా ఉంది. అంతకుముందు ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 4.85 శాతంగా ఉంది. కాగా.. జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను గణాంకాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. డేటా ప్రకారం.. జూన్‌ నెలలో చాలా ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే జూన్ నెలలో గ్రామీణ ద్రవ్యోల్బణం 4.78 శాతం నుంచి 5.67 శాతానికి పెరిగింది. గత మే నెలలో 5.34 శాతంగా నమోదైంది. పట్టణ ద్రవ్యోల్బణం గతేడాది జూన్ లో 4.96 శాతం ఉంటే.. గత నెలలో 4.39 శాతం నమోదైంది. గత మే నెలలో 4.21 శాతం రికార్డైంది. ఈ నెలలో కూరగాయలతో పాటు మాంసం, చేపలు, గుడ్లు, పప్పులు, వాటి ఉత్పత్తులతో పాటు తయారీ ఉత్పత్తుల ధరలు.. పాల ధరలు కూడా పెరిగాయి.

PM Modi: ‘‘సంవిధాన్ హత్య దివాస్‌’’పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..

రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు శాతం వద్ద ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి ప్రభుత్వం బాధ్యతను అప్పగించింది. పాలసీ రేట్లను నిర్ణయించేటప్పుడు ఆర్బీఐ ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. రిజర్వ్ బ్యాంక్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా అంచనా వేసింది. తొలి త్రైమాసికంలో 4.9 శాతం, రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.6 శాతం, నాలుగో త్రైమాసికంలో 4.5 శాతంగా అంచనా వేశారు.

Dharmendra Pradhan: రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అవుతారు.. !

గనులు, విద్యుత్ రంగాల మంచి పనితీరు కారణంగా ఈ ఏడాది మేలో దేశ పారిశ్రామికోత్పత్తి 5.9 శాతం పెరిగింది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (IIP) ఆధారంగా మే 2023లో 5.7 శాతం పెరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) డేటా ప్రకారం, మే 2024లో మైనింగ్ ఉత్పత్తి 6.6 శాతం మరియు విద్యుత్ ఉత్పత్తి 13.7 శాతం పెరిగింది. డేటా ప్రకారం, తయారీ రంగ ఉత్పత్తి వృద్ధి రేటు ఈ ఏడాది మేలో 4.6 శాతానికి క్షీణించింది.. ఈ ఏడాది ప్రారంభంలో 6.3 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-మే మధ్య కాలంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 5.4 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే సమయంలో 5.1 శాతంగా ఉంది.