టెంపుల్ సిటీ న్యూ ఇయర్ జోష్ తో ఉంది. తిరుపతిలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. యువత రెచ్చిపోతే ఇబ్బందులు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సాయంత్రం నుండి తిరుపతిలోని ఫ్లై ఓవర్స్ మూసివేయనున్నారు. అర్థరాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించాలని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి సూచించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో బ్రీత్ అనలైజెర్ టెస్ట్ లు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు మందు తాగి పట్టుబడితే తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు.
Read Also: DGP Mahender Reddy Retirement Parade Live: డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ పరేడ్
కాలేజ్ యాజమాన్యాలకు మందు తాగిన విద్యార్థుల లిస్ట్ పంపుతాం అన్నారు. బైక్ , కార్ రేసింగ్ లకు పాల్పడితే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఎస్పీ. ప్రభుత్వ నిబంధనల మేరకు వైన్ షాప్స్, బార్ లు మూసివేయాలని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆదేశించారు. బైక్ లపై విచ్చలవిడిగా తిరిగితే కఠినచర్యలు వుంటాయన్నారు. విజయవాడ నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది పోలీస్ శాఖ. ఈ మేరకు వేడుకలకు సంబంధించి ఆంక్షల గురించి నగర సీపీ కాంతిరానా టాటా ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, కేకులు కట్ చేస్తూ హడావిడి చేయడం లాంటి చర్యలు కుదరవని హెచ్చరించారు. కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటించాలన్నారు.
విజయవాడలో బార్ అండ్ రెస్టారెంట్లు నిబంధనలు పాటించాలి. నిర్దేశించిన సమయానికి మించి తెరవకూడదు. అలాగే డీజేలకు అనుమతి తీసుకోవాలని నగర సీపీ తెలిపారు. ఈవెంట్స్ ఆర్గనైజర్లు, క్లబ్ లు, పబ్ ల నిర్వాహకులు పోలీసు అనుమతి తీసుకోవాలని, అర్ధరాత్రి 12 గంటల వరకు వేడుకలు నిర్వహించాల్పి వుంటుంది. ప్రజలు వేడుకల్లో పాల్గొన్నా నిబంధనలు పాటించాలి. రాత్రి ఒంటిగంటకల్లా ఇళ్లకు చేరుకోవాలని ముందస్తు సూచన చేశారు. విజయవాడలో ఫ్లై ఓవర్లు మూసేస్తామని, రాత్రిళ్లు రోడ్లపై తిరగడం కుదరదని ప్రజలకు సూచించారు. విజయవాడలో 31 రాత్రి తర్వాత.. 144 సెక్షన్, సెక్షన్ 30 అమలులో ఉంటుంది.
Read Also: Tamil Nadu: తమిళనాడులో బాంబు పేలుడు.. నలుగురు మృతి