NTV Telugu Site icon

US House Speaker: ఎట్టకేలకు ప్రతినిధుల స్పీకర్‌గా కెవిన్ మెక్‌కార్తీ ఎన్నిక

Kevin Mccarthy

Kevin Mccarthy

US House Speaker: ఎట్టకేలకు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ రిపబ్లికన్ పార్టీకి చెందిన కెవిన్‌ మెక్‌కార్తీ ఎన్నికయ్యారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ మెక్‌కార్తీకి పలువురు నేతలు మద్దతు తెలిపారు. రిపబ్లికన్‌ పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలతో 15 రౌండ్ల హైడ్రామా తర్వాత స్పీకర్‌ను ఎన్నుకున్నారు. నిజానికి ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు ఆధిపత్యం ఉన్నా.. కొందరు రెబల్స్ వల్ల తీవ్ర పోరాటం చేయాల్సి వచ్చింది. స్పీక‌ర్ ఎన్నిక కోసం నాలుగు రోజులుగా ఓటింగ్ జ‌రుగుతోంది. ఎట్టకేలకు మెక్‌కార్తీ 216 ఓట్లతో అమెరికా హౌజ్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అమెరికా కాంగ్రెస్‌ 160 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత సుదీర్ఘ కాలం సాగిన స్పీకర్‌ ఎన్నికగా నిలించింది. మెక్‌కార్తీని స్పీకర్‌గా ఎన్నుకునేందుకు రిపబ్లికన్‌ నేతలు 15 రౌండ్ల ఓటింగ్‌ వరకు తీసుకెళ్లారు. 

Iran: భద్రత అధికారి హత్య కేసు.. ఇద్దరు హిజాబ్‌ వ్యతిరేక నిరసనకారులకు ఉరిశిక్ష

ప్రతినిధుల సభలో స్పీకర్‌ ఎన్నిక కోసం మొత్తం 428 మంది ఓటేశారు. దాంట్లో మెక్‌కార్తీకి 216 ఓట్లు రాగా, డెమోక్రటిక్ అభ్యర్థి హ‌కీమ్ జెఫ్రీస్‌కి 212 ఓట్లు ఓట్లు వచ్చాయి. కెవిన్‌కు మెజారిటీ వ‌చ్చింద‌ని, ఆయ‌నే హౌజ్ స్పీక‌ర్ అని క్లర్క్ చెర్లి జాన్సన్ ప్రక‌టించారు. హౌజ్ ఎజెండా, లెజిస్లేటివ్ బిజినెస్ మొత్తం స్పీక‌ర్ ఆధీనంలో ఉంటుంది. ఇక కొత్తగా ఎన్నికైన స‌భ్యుల నియామ‌కం కూడా ఆయ‌న చేతుల్లోనే ఉంటుంది. దీని వ‌ల్లే స్పీక‌ర్ ఎన్నిక అంశం కీల‌కంగా మారింది. మెక్‌కార్తీ ఇప్పుడు నాన్సీ పెలోసీ తర్వాత ప్రతినిధుల సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుల తర్వాత హోదాలో స్పీకర్ నిలుస్తారు. స్పీకర్‌గా విజయం సాధించిన మెక్‌కార్తీకి డోనాల్డ్ ట్రంప్ కంగ్రాట్స్ చెప్పారు.

Show comments