NTV Telugu Site icon

BCCI: వామ్మో బీసీసీఐకి ఇంత ఆదాయం వస్తుందా.. మరి ఆస్ట్రేలియా..?

Bcci

Bcci

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ( బీసీసీఐ).. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరుగాంచింది. ప్రపంచ క్రికెట్‌లో తమ ఆధిపత్యాన్ని భారత క్రికెట్‌ బోర్డు ఇప్పటికి కొనసాగిస్తోంది. ప్రతీ సంవత్సరం తమ నికర అదాయాన్ని బీసీసీఐ పెంచుకుంటూ వెళ్తుంది. క్రిక్‌బజ్‌ నివేదిక ప్రకారం.. అయితే, ప్రస్తుతం బీసీసీఐ క్రికెట్ బోర్డు నెట్‌ వర్త్‌ 2.25 బిలియన్‌ డాలర్లు ( సుమారు రూ.18760 కోట్లు). కాగా, మరే ఇతర ఏ క్రికెట్‌ బోర్డు కూడా బీసీసీఐ దారిదాపుల్లో కనిపించడం లేదు.. అయితే, బీసీసీఐ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ఉంది. క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్షిక ఆదాయం 79 మిలియన్‌ డాలర్లు( సుమారు రూ. 660 కోట్లు). అంటే ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు కంటే బీసీసీఐ ఆదాయం దాదాపు 28 రేట్లు అధికంగా ఉంది. ఇక ఈ జాబితాలో మూడో స్ధానంలో ఇంగ్లండ్ అండ్‌ వేల్స్ క్రికెట్ బోర్డు ఉండగా.. ఈసీబీ నెట్‌వర్త్‌ 59 మిలియన్‌ డాలర్లు(రూ.490 కోట్లు)గా ఉంది.

Read Also: Shriya Saran: శారీలో కొంటె చూపులతో కవ్విస్తున్న శ్రీయా శరన్..

అయితే, బీసీసీఐతో పాటు ఇతర క్రికెట్‌ బోర్డులు ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లను, టోర్నమెంట్‌ నిర్వహణ, క్రికెట్‌ ఆసోషియేషన్‌లకు నిధుల విడుదల చేయడం లాంటివి చూసుకుంటాయి. బోర్డులకు మీడియా రైట్స్‌, స్పాన్సర్‌ షిప్‌ల రూపంలో తమ ఆదాయాన్ని ఆర్జిస్థాయి. కాగా ఐపీఎల్‌ ద్వారా భారత క్రికెట్ బోర్డు ఆర్థిక వృద్ధి బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఈ ఐపీఎల్‌ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐ భారీగా డబ్బును సంపాదిస్తుంది. 2023-27 ​కాలానికి గాను ఐపీఎల్‌ మీడియా రైట్స్‌ కోసం మూడు వేర్వేరు సంస్థలు కలిపి బీసీసీఐకి 48,390.32 కోట్ల రూపాయలు చెల్లించాయి. ఇక, వన్డే ప్రపంచకప్-2023కు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఈ వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి.. భారత అర్ధిక వ్యవస్ధపై మాత్రం కాసుల వర్షం కురిసింది. ఎకమోనిక్ టైమ్స్ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం.. రూ. 22 వేల కోట్లు భారత అర్ధిక వ్యవస్ధలోకి వచ్చినట్లు తెలుస్తుంది.