తెలంగాణలో సుమారు 50 లక్షల మందికి పైగా మహిళలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేణుకా చౌదరి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అభయహస్తం, బంగారు తల్లి పథకాలు ఎక్కడికి వెళ్ళాయని, దాదాపు 5 లక్షల డ్వాక్రా గ్రూపులను సైతం కేసీఆర్ మోసం చేశారన్నారు. డ్వాక్రా రుణాలు కట్టాలని మహిళలను ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని, పాల్వంచలో కెటిపీఎస్ ను కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి చేశామని ఆమె మండిపడ్డారు.
Also Read : Marri Shashidhar Reddy : ఎన్నికల ముందు ఇలాంటి జీవోలు విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధం
అంతేకాకుండా… 800 మెగావాట్ పవర్ ప్లాంట్ ఎందుకు ఆగిపోయిందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసే అవినీతి వలన ప్రభుత్వం పతనం అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ద్వారా మహిళలకు ఎలాంటి సహాయం అందడం లేదని, కేసీఆర్ మొదటి కేబినెట్‌లో మహిళా మంత్రినే లేరని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. గిరిజన హక్కులను కేసీఆర్ ప్రభుత్వం కాలరాస్తుందని ఆమె ధ్వజమెత్తారు.
Also Read : YadammaRaju: జబర్దస్త్ నటుడికి యాక్సిడెంట్.. భార్య చేసిన పనికి బూతులు తిడుతున్న నెటిజన్స్