Renu Desai: సినీ నటి, ఏపీ ఉప ముఖ్యమంత్రి మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై తీవ్రంగా స్పందించారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని, రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని స్పష్టం చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా అకౌంట్లు ఇష్టం వచ్చినట్లుగా థంబ్‌నెయిల్స్ పెట్టి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతేకాకుండా.. “నేను రాజకీయాల్లో లేను… చేరే ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పింది. కానీ చానల్స్ వాళ్లు కావాలనే నా పేరుతో రాజకీయ కోణం తీసుకొస్తున్నారని.. ఇది పూర్తిగా తప్పు అంటూ రేణు దేశాయ్ మండిపడ్డారు. అలాగే తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి మీరెవరు..? పవన్ కళ్యాణ్ పేరు తీసుకొచ్చి నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఇది అసహ్యకరం అంటూ ఫైర్ అయ్యారు.
యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ బీస్ట్ గా రాబోతున్న iQOO 15 Ultra.. లాంచ్ ఎప్పుడంటే..?
ఇది ఇలా ఉండగా తాను మనుషుల ప్రాణాలతో పాటు జంతువుల ప్రాణాల కోసం కూడా పోరాడుతున్నానని ఆమె అన్నారు. వీధి కుక్కల విషయంలో.. నేను మీ పిల్లలకు కుక్కలు కరవాలని అనలేదని.. నా పిల్లలకు కుక్క కాటు కావాలని మీరు ఎలా అంటారని.. కొందరు అలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కుక్కల విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే GHMCకి కాల్ చేయండి, లేదంటే తనకు చెప్పండి అని.. తానే తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. అంతేగానీ జంతువులను చంపడమే పరిష్కారం కాదని ఆమె మండిపడ్డారు.
వీధి కుక్కల అంశానికి సంబంధించిన సుప్రీం కోర్టు తీర్పుపై కూడా రేణు దేశాయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ జడ్జ్ తన వ్యక్తిగత భావాల ఆధారంగా తీర్పు ఇచ్చినట్లు అనిపిస్తోందని.. ఆ జడ్జ్‌కు కుక్క ఏదో చేసి ఉండొచ్చు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రతి వ్యవస్థ అవినీతిమయమైపోయిందని, డబ్బు ఉంటే న్యాయం దొరుకుతుందని.. డబ్బు లేకపోతే న్యాయం దొరకదని ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే కుక్కలు ఎక్కడికి వెళ్లి న్యాయం అడగాలి? అంటూ కూడా ప్రశ్నించారు.
యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ బీస్ట్ గా రాబోతున్న iQOO 15 Ultra.. లాంచ్ ఎప్పుడంటే..?
ఎవరికైనా ఏదైనా జరిగిందని చెప్పి వీధి కుక్కలను చంపడం ఎంతవరకు సరైనది? అని ప్రశ్నిస్తూ.. ఈ విధానాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని రేణు దేశాయ్ అన్నారు. సమస్యలకు మానవీయ పరిష్కారాలు వెతకాలని, హింసే మార్గమవ్వకూడదని సూచించారు.