Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ ఈ మధ్యకాలంలో సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో, ఆమె ఇక సినిమాలు ఒప్పుకోరేమో అని అందరూ అనుకున్నారు. ఇక, ఆ మధ్య ఆమె ఒక కామెడీ ఎంటర్‌టైనర్ ఫైనల్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఒక చిన్న సినిమా అయినా తన పాత్ర నచ్చడంతో ఆమె ఒప్పుకున్నారని అందరూ భావించారు. అయితే, ఆ సినిమా ఏమిటో కాదు, ’16 రోజుల పండుగ’. టాలీవుడ్ నిర్మాత డి.ఎస్. రావు కుమారుడు కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాని దర్శకుడు సాయికిరణ్ అడవి తెరకెక్కిస్తున్నారు.
READ MORE: Liver Health Tips: లివర్‌ని ఆరోగ్యంగా ఉంచుకోవాలా..? ఔషధాలకు బదులు ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..
ఇక, ఈ సినిమాలోనే ఇప్పుడు రేణు దేశాయ్ మరోసారి నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె మాత్రమే కాదు, అనసూయ, కృష్ణుడు, పార్వతీశం, ‘కేరింత’ భావన, సత్య కృష్ణ వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక, ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు లాంచ్ తర్వాత వెల్లడించే అవకాశం ఉంది. ఈ సినిమా ఈరోజే లాంచ్ అవుతోంది. ఈ లాంచింగ్ కార్యక్రమానికి రేణు దేశాయ్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని టీమ్ చెబుతోంది. మొత్తం మీద, రేణు దేశాయ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం హాట్ టాపిక్ అవుతోంది.