Cloth Planning: భారతదేశంలో జ్యోతిష్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు మన జీవితాలపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. వారంలోని ప్రతి రోజు నిర్దిష్ట గ్రహంతో ముడిపడి ఉంటుంది. ఆ గ్రహానికి సంబంధించిన బట్టలు వేసుకుంటే మన అదృష్టం మారిపోతుంది. మన జీవితంలో కష్టాలు తగ్గుతాయి. బాధ ఆనందంగా మారుతుంది.
వారంలోని ఏడు రోజుల్లో ఏయే రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసుకుందాం..
సోమవారం: ఈ రోజును శివుడి రోజుగా భావిస్తారు. కాబట్టి సోమవారం తెల్లని దుస్తులు ధరించాలి.
మంగళవారం: మంగళవారం ఆంజనేయుడి రోజుగా పరిగణిస్తుంటారు.. కాబట్టి ఈ రోజు ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులను ధరించాలి.
బుధవారం: బుధవారం వినాయకుడికి ప్రీతికరమైన రోజు. గణేశునికి దూర్వా అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆ రోజు పచ్చని బట్టలు ధరించండి.
గురువారం: గురువారాన్ని భగవంతుడు హరి రోజుగా భావిస్తారు. పసుపు రంగు ఈ దేవుడికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించండి.
శుక్రవారం: శుక్రవారం లక్ష్మీ దేవి రోజు. ఈ రోజున మనం గులాబీ రంగు దుస్తులను ధరించవచ్చు. అలాగే ఈ రోజున మనం తెలుపు రంగును ధరించవచ్చు.
శనివారం : శనివారం శనిదేవుని రోజు. కాబట్టి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నల్లని దుస్తులు ధరించండి.
ఆదివారం: ఆదివారం సూర్య భగవానుడి రోజు కాబట్టి, ఈ రోజు మనం బంగారు, నారింజ రంగుల దుస్తులను ధరించాలి.
నోట్ : ఈ సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.