NTV Telugu Site icon

AP High Court: మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏపీ హైకోర్టులో ఊరట

Atchannaidu

Atchannaidu

AP High Court: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడికిహైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అచ్చెన్నాయుడిపై ముందస్తు చర్యలు వద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో ఏ-38గా అచ్చెన్నాయుడిని సీబీఐ చేర్చిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టులో అచ్చెన్నాయుడి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీని కోర్టు ఆదేశించింది. అదనపు వివరాలు సమర్పించేందుకు సీఐడీ సమయం కోరింది.

Read Also: Kodali Nani: అలా ఒక్కరితో చెప్పించినా పోటీ చేయను.. ప్రచారంలో కొడాలి నాని సవాల్

తదుపరి విచారణ ఏప్రిల్ 2కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. . కాగా, ఇదే కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. 52 రోజుల పాటు జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.

Show comments