NTV Telugu Site icon

High Court : ఐఏఎస్‌లకు లభించని ఊరట.. అధికారులు ముందు వెళ్లి రిపోర్ట్‌ చేయాలన్న హైకోర్టు

Ias Highcourt

Ias Highcourt

క్యాట్ తీర్పుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. సివిల్ సర్వెంట్ల నియామకాలను నిర్ధారించలేమని స్పష్టం చేస్తూ, ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనర్థకమని హైకోర్టు పేర్కొంది. ఐఏఎస్ అధికారుల బదిలీపై స్టే ఇవ్వడం జరగదని, సంబంధిత వ్యక్తులు ముందుగా అక్కడ వెళ్లి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అధికారులు ముందు వెళ్లి రిపోర్ట్‌ చేయాలని, కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి రిపోర్ట్‌ చేసిన తర్వాతే విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. రిపోర్ట్‌ చేయకుండా ఏమీ చేయలేమని, ప్రజాసేవ కోసమే ఐఏఎస్‌లు అని, ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడికి వెళ్లాలని హైకోర్టు తెలిపింది. ట్రిబ్యునల్‌ కొట్టేస్తే కోర్టులకు రావడం కరెక్ట్‌ కాదని, మీ వాదనలు వింటాం.. కానీ ఇలాంటి విషయాల్లో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

Sanju Samson: మనసులో మాట బయటపెట్టిన శాంసన్.. అంత ఈజీ కాదేమో!

అయితే.. ఇటీవల, డీవోపీటీ బదిలీ చేసిన ఐఏఎస్ అధికారులు, రొనాల్డ్ రోస్, సృజన, శివశంకర్, హరికిరణ్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్ వంటి వారు హైకోర్టుకు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వద్ద తమ బదిలీని నిలిపివేయాలని కోరగా, అక్కడ వారు నిరాకరించడంతో, తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు విచారణ చేపట్టింది.

ఐఏఎస్ ల తరుపు న్యాయవాది మాట్లాడుతూ.. క్యాట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తున్నామని, క్యాట్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని హై కోర్ట్ కోరిందన్నారు. ఆర్డర్ కాపీ ఇంకా రాలేదని కోర్ట్ కు తెలిపామని, ఐఏఎస్ పిటిషన్ లను క్యాట్ అడ్మిట్ చేసుకుంది అని ఆయన తెలిపారు. క్యాట్ తదుపరి విచారణ నవంబర్ 4 కు వాయిదా వేసిందని ఐఏఎస్ కౌన్సిల్ తెలిపారు. అప్పటి వరకు ఐఏఎస్ లను రిలీవ్ చేయకుండా ఉండలే ఆదేశాలు ఇవ్వాలని ఐఏఎస్ కౌన్సిల్ కోరింది.